LIVE : ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డులకు లింక్ పెడుతున్నారని, పథకాల్లో కోతలు విధిస్తున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ ఇష్టారీతిలో హామీలు ఇచ్చిందని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అదానీని తిట్టారని, మోదీ మనిషి అన్నారని, కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Mar 4, 2024, 1:23 PM IST