LIVE : తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR PRESS MEET AT TELANGANA BHAVAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2024/640-480-22846794-thumbnail-16x9-ktr.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 7, 2024, 3:08 PM IST
|Updated : Nov 7, 2024, 3:45 PM IST
BRS Leader KTR Press Meet at Telangana Bhavan : ఫార్ములా -ఈ కారు రేస్ వ్యవహారంలో కేసు విచారణ వేగవంతం అయింది. ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సైతం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ సైతం న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే హైడ్రా విషయంపై కూడా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి ఇప్పుడు హైడ్రా, సమగ్ర కుటుంబ సర్వే అంటూ నాల్చుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట పేద ప్రజలకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Last Updated : Nov 7, 2024, 3:45 PM IST