ETV Bharat / offbeat

చూస్తేనే నోరూరిపోయే "మీల్​ మేకర్ మంచూరియా" - 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - MEAL MAKER MANCHURIAN

చికెన్, వెజ్ మంచూరియా మాత్రమే కాదు - ఓసారి ఇలా మీల్​ మేకర్స్​తో ట్రై చేయండి!

MANCHURIAN RECIPE
Soya Chunks Manchurian (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 6:52 PM IST

How to Make Soya Chunks Manchurian : మంచూరియా.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి తినాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే బయట ఫాస్ట్​ఫుడ్ సెంటర్స్​కి వెళ్లి చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా వంటివి టేస్ట్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ అవేకాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా "మీల్ మేకర్ మంచూరియా" ట్రై చేయండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! ఎంతలా అంటే.. మీల్ మేకర్స్ తినడానికి ఇష్టపడని వారూ దీన్ని ఎంతో ఇష్టంగా తినేస్తారంటే నమ్మండీ! మరి, ఈ సూపర్ టేస్టీ మంచూరియాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెద్ద సైజ్ మీల్​ మేకర్స్ - ఒకటిన్నర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • షెజ్వాన్ సాస్/చిల్లీ సాస్ - 2 టీస్పూన్లు
  • సోయా సాస్ - 2 టీస్పూన్లు
  • మైదా పిండి - 2 టేబుల్​స్పూన్లు
  • కార్న్​ఫ్లోర్ - 4 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - తగినంత
  • అల్లం ముక్కలు - 1 టీస్పూన్
  • వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • ​సన్నగా తరుక్కున్న ఆనియన్స్ - కొన్ని
  • మిరియాల పొడి - అరటీస్పూన్
  • టమాటా సాస్ - 2 టేబుల్​స్పూన్లు
  • వెనిగర్ - 1 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - కొంచం

ఆహా అనిపించే "క్రిస్పీ మీల్ మేకర్ కట్​లెట్స్" - 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్!

తయారీ విధానం :

  • ముందుగా మీల్​ మేకర్స్​ని ఉడికించుకోవాలి. అందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని మూడు కప్పుల వాటర్​తో పాటు అరటీస్పూన్ ఉప్పు వేసి నీళ్లను వేడిచేసుకోవాలి. వాటర్ వేడయ్యాక మీల్​ మేకర్స్ అందులో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసి వాటర్​ని వడకట్టుకోవాలి. ఆపై అందులో చల్లని వాటర్ పోసుకొని చేతితో మీల్​ మేకర్స్​లోని అదనపు నీటిని పిండి ఒక మిక్సింగ్ బౌల్​లోకి వేసుకోవాలి.
  • అనంతరం ఆ మీల్​మేకర్స్​లో ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ చొప్పున షెజ్వాన్ సాస్/చిల్లీ సాస్, సోయా సాస్, 3 టేబుల్​స్పూన్ల కార్న్​ఫ్లోర్​(మొక్కజొన్న పిండి), మైదా పిండిని వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ మీల్​ మేకర్స్​కి చక్కగా కోటింగ్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఆపై 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • అయితే, మిక్స్​చేసుకునేటప్పుడు పొడిపొడిగా అనిపిస్తే కొన్ని వాటర్​ని చల్లుకుంటూ కలుపుకోవచ్చు. అలాగే.. మీల్​ మేకర్స్​కి పిండి సరిగా కోటింగ్ అయినట్లు అనిపించకపోతే అదనంగా కొద్దిగా మైదా, కార్న్​ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు.
  • 10 నిమిషాల తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని డీప్​ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ ​మేకర్స్​ని ఒక్కక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
  • మిల్​ మేకర్స్ చక్కగా వేగి క్రిస్పీగా, గోల్డెన్ కలర్​లోకి వచ్చాయనుకున్నాక.. వాటిని జాలీ గంటెతో టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • అనంతరం స్టౌపై మరో పాన్ పొట్టుకొని రెండు టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, సన్నని ఉల్లిపాయ ​ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ చొప్పున షెజ్వాన్, సోయా సాస్, టమాటా సాస్, వెనిగర్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఒక చిన్న కప్పులో కొద్దిగా వాటర్ తీసుకొని 1 టేబుల్​స్పూన్ కార్న్​ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • తర్వాత దాన్ని స్టౌపై వేడి చేసుకుంటున్న మిశ్రమంలో వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి.
  • అనంతరం అందులో ముందుగా వేయించుకున్న మిల్​మేకర్స్​తో పాటు కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మీల్ ​మేకర్​ మంచూరియా" రెడీ!

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మీల్ మేకర్ కుర్మా"- ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే మటన్​ కూడా దిగదుడుపే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.