LIVE : గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మేధావుల సదస్సులో రాహుల్ గాంధీ - ప్రత్యక్ష ప్రసారం - RAHUL GANDHI TOUR IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2024, 6:46 PM IST
|Updated : Nov 5, 2024, 7:08 PM IST
Rahul Gandhi At Gandhi Ideology Center Live : కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. రేపటి నుంచి తెలంగాణ అంతటా జరిగే కులగణన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మేధావుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయబరేలి నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడి నుంచి ఐడియాలజీ సెంటర్కు వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఆ తరువాత రావడం ఇదే. సికింద్రాబాద్ బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్యంగా చూద్దాం.
Last Updated : Nov 5, 2024, 7:08 PM IST