CHAMPIONS TROPHY 2025 HYBRID MODEL : 2025 ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తుందని తెలిసినప్పటి నుంచి భారత్ తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. పాక్‌లో టీమ్ ఇండియా అడుగు పెట్టే అవకాశం లేదని హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. అంతే కాదు ఈ అంశంపై బీసీసీఐ చేసిన అభ్యర్థనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. అయితే వార్తలను తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తోసిపుచ్చింది.
కొన్ని నివేదికల ప్రకారం, "పాక్‌లో టీమ్ ఇండియా పర్యటించడానికి సిద్ధంగా లేదు. తమ మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించాలని కోరింది. దీనికి పీసీబీ కూడా అంగీకారం తెలిపింది." అని పేర్కొన్నాయి. అయితే ఈ ప్రచారాన్ని పీసీబీ ఖండించింది.
- పాకిస్థాన్ ఆలోచన ఏంటి? - అయితే తాజా నివేదికల ప్రకారం పాకిస్థాన్ అన్ని మీడియా ప్రచారాలను కొట్టిపారేసిందని తెలిపాయి. కరాచీ, లాహోర్, రావల్పిండిలో టోర్నమెంట్‌ను నిర్వహించాలని పాకిస్థాన్ భావిస్తోందని, హైబ్రిడ్ మోడల్‌ని పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశాయి.
"హైబ్రిడ్ మోడల్ పరిశీలనలో లేదు. కొందరు X Y Z సోర్సెస్‌ను క్లెయిమ్ చేస్తూ కథనాలను పబ్లిష్ చేస్తున్నారు. కేవలం కొన్ని వ్యూస్ పొందడం కోసం ఏదైనా ఫైల్ చేస్తారు. ప్రస్తుతానికి మేము ఏదీ నిర్ణయించుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఉంది. కొత్తగా ఎలాంటి మార్పులు జరగలేదు." అని పీసీబీ వర్గాలు తెలిపినట్లు సమాచారం.
- భారత ప్రభుత్వం నిర్ణయం ఏంటి?
భద్రతా కారణాలతో పాక్, భారత్ మధ్య చాలా కాలంగా దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభిస్తేనే టీమ్ ఇండియా పాక్‌కు వెళ్లగలదు. అయితే ఇది జరిగే అవకాశం లేదని చాలా మంది అభిప్రాయం.
గతంలో 2023 ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు బీసీసీఐ అభ్యర్థన మేరకు భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. ఈ టోర్నీకి భారత్ అర్హత సాధించడంతో ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరిగింది.
- షెడ్యూల్ ఎప్పుడు?
నవంబర్ 11న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని భావిస్తున్నారు. టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. పీసీబీ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, భారతదేశం-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ 2025 1 మార్చిన లాహోర్‌లో జరిగే అవకాశం ఉంది. ఫైనల్ మార్చి 9న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.
మొసళ్ల నదిలో పడిపోయిన మాజీ క్రికెటర్ - ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉందంటే?
'ఔట్ అవ్వడంలో ఇదో కొత్తరకం!' - మళ్లీ నిరాశపరిచిన కేఎల్ రాహుల్!