LIVE : కొండాపూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం - BRS MLA Padi Kaushik Reddy Live - BRS MLA PADI KAUSHIK REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 11:27 AM IST
|Updated : Sep 12, 2024, 11:43 AM IST
BRS MLA Padi Kaushik Reddy Live : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల శాసన సభాపతి నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అరెకపూడి ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఎమ్మెల్యే అరెకపూడి స్పందించారు. దాన్ని స్వీకరిస్తున్నట్లు అరెకపూడి గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు.
Last Updated : Sep 12, 2024, 11:43 AM IST