అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు : దానం నాగేందర్ - Danam Comments on Revanth Reddy
🎬 Watch Now: Feature Video
Published : Jan 20, 2024, 1:29 PM IST
BRS MLA Danam Nagender Comments on Revanth Reddy : లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. అధికారం ఉందని వంద మీటర్ల లోతులో తొక్కిపెడతా అనడం సబబు కాదని వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన, అధికారం ఉన్నా లేకపోయినా తాము ఒకేలా ఉన్నామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి కానీ, రాష్ట్ర పరువు బజారుకీడిస్తే ఎలా అని దానం ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు.
BRS Parliamentary Review Meeting : లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం జరుగుతోంది. రెండు నియోజకవర్గాల పరిధిలోని నేతలు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దానం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.