LIVE : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
🎬 Watch Now: Feature Video
BRS Leaders Pressmeet Live : లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దావోస్‌లో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారని ధ్వజమెత్తారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తేవాలి కానీ, వెకిలి మాటలు మాట్లాడొద్దని అన్నారు. రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన తెలిపారు. రేవంత్‌రెడ్డి అధికారం ఉందని వంద మీటర్ల లోతులో తొక్కిపెడతా అనడం సబబు కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మేము ఒకేలా ఉన్నామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి కానీ, రాష్ట్ర పరువు బజారుకీడిస్తే ఎలా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని దానం నాగేందర్ సవాల్ విసిరారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు పాల్గొన్నారు.