LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం - BRS leaders live
🎬 Watch Now: Feature Video
BRS Leaders Live : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని నేతలు అంటున్నారు. రైతులను ఆదుకోవడానికి వరికి బోనస్, రైతు భరోసా అమలు, రుణమాఫీ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఎకరానికి రూ. 25,000ల పరిహారం ఇవ్వాలని అన్ని పంటలను రూ.500 రూపాయల బోనస్‌తో కొనుగోళ్లు చేయాలని పేర్కొంటున్నారు. కొంత మంది అవకాశ వాదులను, భారత్ రాష్ట్ర సమితిని వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో ఆహ్వానించేది లేదని తేల్చి చెబుతున్నారు. పార్టీ మారిన దానం నాగేందర్‌పై వేటు వేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెెడ్డి తన పార్టీలో ఉన్నవాళ్లు పోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Last Updated : Apr 11, 2024, 1:37 PM IST