LIVE : ఎమ్మెల్సీ కవిత నివాసం నుంచి ప్రత్యక్షప్రసారం - BRS Leaders Live
🎬 Watch Now: Feature Video
Published : Mar 15, 2024, 1:12 PM IST
|Updated : Mar 15, 2024, 7:16 PM IST
BRS Live : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించారు. ఈడీ సోదాల విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని భారాస లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. కవితను రాత్రి దిల్లీకి తరలించే అవకాశం ఉంది.
Last Updated : Mar 15, 2024, 7:16 PM IST