రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు : వినోద్ కుమార్ - BRS Leader Vinod Kumar Comments - BRS LEADER VINOD KUMAR COMMENTS
🎬 Watch Now: Feature Video
Published : Aug 18, 2024, 7:58 PM IST
BRS Leader Vinod Kumar On Rythu Runa Mafi : రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తొలుత రూ.46 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు. దీంతో కేవలం 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే రైతులందకీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు వినోద్ కుమార్ హాజరై నివాళులు అర్పించారు. అనంతరం వినోద్ కుమార్ చేతికి పలువురు మహిళలు రాఖీలు కట్టగా ఆయన వారిని దీవించారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికీ చెరువులు, కుంటలు నీరు లేక ఎండిపోతున్నాయని నార్లు వేసుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసవి కాలంలోనూ చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు.