LIVE : జగిత్యాలలో కేసీఆర్ బస్సుయాత్ర - KCR Road Show Jagtial LIVE - KCR ROAD SHOW JAGTIAL LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 3:50 PM IST
|Updated : May 5, 2024, 8:53 PM IST
BRS Chief KCR Jagtial Road Show Live : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లా వీణవంకకు విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు కలసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ హాయంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన హస్తం పార్టీ ఆ మాటను ఇప్పటి వరకు నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. అక్కడి నుంచి గులాబీ బాస్ జగిత్యాలకు వచ్చారు. మార్గమధ్యలో అడుగడుగునా ప్రజలను బస్సులో నుంచే పలకరిస్తూ జగిత్యాల చేరుకున్నారు. జగిత్యాల చౌరస్తాలో స్థానికులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
Last Updated : May 5, 2024, 8:53 PM IST