దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ లక్ష్మణ్ నివాళులు - eenadu group chairman ramoji rao - EENADU GROUP CHAIRMAN RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 10:02 PM IST
BJP MP Laxman Paid Tribute to Late Ramoji Rao : దివంగత రామోజీరావుకు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మరణంతో దేశం గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయిందని లక్ష్మణ్ అన్నారు. విలువలతో కూడిన జీవనం రామోజీరావు సాగించారని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు.
మరోవైపు రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు నివాళి అర్పించారు. ఫిల్మ్‌సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు ప్రజల పక్షాన బలమైన గళం వినిపించారని అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈనాడు పత్రిక చదవలేనిదే ఉదయం కాదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి కూడా రామోజీరావుకు నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు