కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని ప్రజలంతా పూజలు చేయాలి - ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు - MP Arvind Comments on Congress Govt - MP ARVIND COMMENTS ON CONGRESS GOVT
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 12:29 PM IST
BJP MP Arvind Comments on Congress Govt : కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలిపోవడం ఖాయమని, ప్రభుత్వం పడిపోవాలని ప్రజలంతా పూజలు చేయాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లోని నవీపేట్ మండలం జన్నేపల్లి, రెంజల్ మండల కేంద్రాల్లో ఎంపీ అర్వింద్ ఎన్నికల కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికార హస్తం పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడు నెలల తర్వాత రేషన్ కార్డుల కోసం ఉద్యమిస్తామని తెలిపారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించి అవినీతిని పెంచి పోషించినందుకే అధికారం కోల్పోయిందన్నారు. ప్రధాని మోదీతోనే సుస్థిర పాలన సాధ్యమని, దేశమంతా మోదీ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా లోకసభ ఎన్నికల్లో నరేంద్రుని నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.