వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు షర్మిల ఖాతాలోకి: విఘ్ణకుమార్ రాజు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 4:06 PM IST
BJP Leader Vishnu Kumar Raju Comments on YSRCP : షర్మిల రాకతో వైసీపీ పనైపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఘ్ణకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. మెజార్టీ నాయకులంతా ఆ పార్టీని వీడేెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ - జనసేన, జనసేన - తెలుగుదేశం మధ్య పొత్తు ఉందని ఈ మూడు పార్టీలు కలవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే 150 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం వల్ల వైఎస్సార్సీపీకి గట్టి దెబ్బ తగులుతుందని విఘ్ణకుమార్ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయం వైసీపీలో ప్రకంపనలను రేకెత్తించిందని ఉద్ఘాటించారు. సీఎం జగన్ ఓటు బ్యాంకు షర్మిల ఖాతాలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు 10 శాతం వరకు ఓట్లు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ కలవడానికి విముఖత చూపుతున్నారని వెల్లడించారు. దీంతో అధికార ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.