8 చోట్ల విజయదుందుభితో బీజేపీ శ్రేణుల సందడి - రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు - BJP Celebrations on MP Results - BJP CELEBRATIONS ON MP RESULTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 8:34 PM IST

BJP Celebration over MP Election Results : లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం, రాష్ట్రంలో 8 స్థానాల్లో సత్తా చాటడంతో డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ బీజేపీ శ్రేణులు సందడి చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సంబురాలు జరుపుకున్నారు. 

BJP Activists Celebrations in Medak : మెదక్​ బీజేపీ అభ్యర్థి రఘనందన్​ రావు గెలిచిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి రంగులు చల్లకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ క్రమంలో మోదీ మోదీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తుది అంకంలో తీవ్ర ఉత్కంఠభరితమైన పోరులో మహబూబ్​నగర్​, చేవెళ్ల స్థానాలతో పాటు బీజేపీ మొత్తం 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.