రాజ్‌భవన్‌లో ఘనంగా సాగిన బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA CELEBRATIONS RAJ BHAVAN
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2024, 10:59 PM IST
Bathukamma Celebrations At Raj Bhavan : రాజ్‌భవన్‌లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన సతీమణి సుధాదేవ్ వర్మ పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. సీఎస్ శాంతి కుమారి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు గవర్నర్ దంపతులు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుధా దేవ్ వర్మ బతుకమ్మ సంబరాలలో రాజ్‌భవన్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆచారవ్యవహారాలను అనుసరించారు. బతుకమ్మను తీసుకుని రాజ్ భవన్ ప్రధాన భవనం ఎదుట ఉన్న ఆవరణలోకి వచ్చిన ఆమె అక్కడే రాజ్‌భవన్ సిబ్బంది కుటుంబాలతో కలిసి ఆడిపాడారు.
మరోవైపు సద్దుల బతుకమ్మ వేడుకలను ఈ నెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు.