బిల్డింగ్ అంచున ప్రమాదంలో చిన్నారి- స్థానికుల హెల్ప్‌తో సేఫ్- పెద్ద రెస్క్యూ ఆపరేషనే చేశారుగా! - Baby Rescue Operation - BABY RESCUE OPERATION
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 9:57 AM IST
Baby Rescue Viral Video Chennai : తమిళనాడు చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు బాల్కనీ నుంచి చిన్నారి ప్రమదవశాత్తు కిందపడిపోయింది. ఆ తర్వాత మొదటి అంతస్తు పైకప్పుపై చిక్కుకుంది. వెంటనే గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు చాకచక్యంగా వ్యవహరించారు. చిన్నారిని సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే?
తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో వెంకటేశన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నారు. అయితే ఆయన భార్య రమ్య తన కుమార్తె హైరిన్ను చంకలో ఎత్తుకుని ఇంటి బాల్కనీలో నిల్చున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు చిన్నారి కిందపడిపోయింది. మొదటి అంతస్తు బాల్కనీ పైకప్పుపై ఇరుక్కుంది. అయితే చిన్నారి పడిన శబ్దం విన్న అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా బయటకొచ్చారు.
హుటాహుటిన చిన్నారి రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మొదటి అంతస్తులోని ఓ ఇంటి కిటికీలోంచి ఎక్కి చిన్నారిని రక్షించారు ఓ వ్యక్తి. ఆ సమయంలో అపార్ట్‌మెంట్ నివాసితులంతా పెద్ద దుప్పట్లను పట్టుకుని కూడా కింద అప్రమత్తంగా ఉన్నారు. మొత్తానికి హైరిన్ను కాపాడారు. ఆ తర్వాత చిన్నారిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.