శివుడికి భక్తుల పిటిషన్లు- రోజూ చదివి వినిపించే పూజారి- ఇలా చేస్తే కోరికలు తీరుతాయట! - Arji Wale Mahadev Temple - ARJI WALE MAHADEV TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 4:15 PM IST

Arji Wale Mahadev Temple In Ajmer : ఎక్కడైనా కోర్కెలు తీర్చమని మనసులో దేవుడిని కోరుకోవడం లేదా ఆలయానికి వెళ్లి ప్రార్థించడం వంటివి చేస్తాం. కానీ రాజస్థాన్ అజ్​మేర్​లోని ఓ శివుడి గుడిలో మాత్రం భక్తులు వినూత్నంగా తమ కోర్కెలు నెరవేర్చమని పిటిషన్ల రూపంలో వేడుకుంటారు.  

అజ్​మేర్​లోని పుష్కర్​ రోడ్డులో ప్రభుత్వ ఫార్మాసిటీ ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది.  ఈ గుడిలో దాదాపు 150 ఏళ్ల పురాతమైన శివలింగం ఉంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ విన్నపాలను ఒక కాగితంపై రాసి మహదేవ్​ పాదాల వద్ద పెడతారు. అలా వచ్చిన పిటిషన్లు పూజా కార్యక్రమాల అనంతరం దేవుడికి ఆలయ పూజారి చదివి వినిపిస్తారు. ఇలా చేయడం వల్ల కచ్చితంగా కోరికలు నెరవేరుతాయని భక్తలు విశ్వాసిస్తారని ఆలయ పూజారి జ్ఞాన్ ​ప్రకాశ్ కటారియా  అన్నారు. అందుకే ఈ గుడిని 'అర్జీవాలే మహాదేవ్'​ ఆలయంగా పిలుస్తారని అంటున్నారు. 

'40 ఏళ్ల కిత్రం ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. నేను మొదటిసారి ఆలయాన్ని చూసినప్పుడు ఎలాగైనా బాగు చేయాలని నిర్ణయించుకున్నా. అదే రోజూ రాత్రి గుడిని శుభ్రం చేసి పూజ చేయాలని కల వచ్చింది. ఆ మరుసటి రోజు శుభ్రం చేసి పూజలు చేయడం ప్రారంభించా. అప్పటి నుంచి ఆ మహదేవ్​కు సేవలు చేస్తున్నానే ఉన్నా. ప్రతి సోమవారం భక్తలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక శివరాత్రికి ప్రత్యేకంగా రెండు రోజుల పాటు జాతరను నిర్వహిస్తాం. గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ కోరికలను లేఖల రూపంలో సమర్పించి వెళ్తారు' అని జ్ఞాన్ ప్రకాశ్​ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.