డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల - YS Sharmila meets Deputy CM Bhatti - YS SHARMILA MEETS DEPUTY CM BHATTI
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 2:50 PM IST
AP PCC president Sharmila Meets Deputy CM Bhatti : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లోని భట్టి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ అంశాలపై, ఏపీలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.
Sharmila invites Bhatti for YS Rajasekhara Reddy Birth Anniversary : ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు రావాలని షర్మిల భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. గత నెలలో కూడా దిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.