క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు - ఆ మహనీయుడి వల్లే ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నా : యమున - Actress Yamuna On Ramoji Rao Demise - ACTRESS YAMUNA ON RAMOJI RAO DEMISE
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 12:32 PM IST
|Updated : Jun 8, 2024, 2:16 PM IST
Actress Yamuna On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రముఖ సినీ నటి యమున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు తాను ఉన్నత స్థానంలో ఉన్నానంటే దానికి కారణం రామోజీరావేనని అన్నారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరని కొనియాడారు. కష్టాన్ని నమ్ముకున్న వారు ఎల్లప్పుడూ బాగుంటారని ఆయన చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మానవత్వమున్న మనిషని తెలిపారు.
ఏ చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తైనా కష్టపడే పనిచేసే వారంటే ఆయనకు ఇష్టమని వివరించారు. అలాంటి వారిని గౌరవించి సొంత కుటుంబంలోని వారిలా చూసుకునేవారు. అలా ఆయన ఉన్నారు కనుకే ఈ రోజుటి వరకు తాను ఈటీవీలో పనిచేయగలుగుతున్నానని వివరించారు. రామోజీరావు మరణవార్త విని షాక్కు గురైనట్లు తెలిపారు. 'ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు 'ఏదీ ఏమైనా షూటింగ్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని' ఆయన మాటలను ఆదర్శంగా తీసుకునే ఈ రోజు షూటింగ్కు వెళ్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని తెలిపారు.