LIVE : చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల - ప్రత్యక్షప్రసారం - ALLU ARJUN LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 14, 2024, 6:38 AM IST
|Updated : Dec 14, 2024, 7:31 AM IST
Actor Allu Arjun Release Live : అరెస్టయిన అల్లు అర్జున్ విడుదలపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠత కొనసాగింది. తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. అల్లు అర్జున్ న్యాయవాదులు పూచీకత్తు బాండ్లు తీసుకొని చంచల్‌గూడ జైలు అధికారులతో మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. సాధారణంగా ఆలస్యంగా వచ్చిన బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన విచారణ ఖైదీలను మరుసటిరోజు విడుదల చేయటం ఆనవాయితీ. దీంతో అల్లు అర్జున్‌ను శనివారం (నేడు) ఉదయం విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా.. ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి ప్రత్యక్షప్రసారం.
Last Updated : Dec 14, 2024, 7:31 AM IST