30 అడుగుల బావిలో పడ్డ గున్న ఏనుగు- రాత్రంతా అలానే! - Elephant Fell Into 30 Foot Well
🎬 Watch Now: Feature Video
Published : May 29, 2024, 5:15 PM IST
Baby Elephant Fell Into 30 Foot Well : నీటి కోసం వచ్చిన ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు 30 అడుగుల బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సుమారు 6గంటలు శ్రమించి రక్షించారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గున్న ఏనుగును బయటకు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇది జరిగింది
నీలగిరిలోని అడవుల్లోని ఏనుగులు ఆహారం, నీటి కోసం సమీప ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కోలపల్లి గ్రామ పరిధిలోని ఓ బావిలో పడిపోయింది ఓ గున్న ఏనుగు. రాత్రి సమయం కావడం వల్ల ఏనుగు పడిన 5గంటల తర్వాత గుర్తించారు స్థానికులు. సమచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలను పిలిపించి ఏనుగు పిల్ల బయటకు వచ్చే విధంగా దారిని తొలిచారు. సుమారు 6గంటలు శ్రమించి ఏనుగు పిల్లను రక్షించారు అటవీ సిబ్బంది. అలా దాదాపు 11 గంటల తర్వాత బయటకు వచ్చిన ఏనుగు అడవిలోకి పరిగెత్తింది.