ఆర్టీసీ బస్సులో బానెట్ గొడవ - కండక్టర్‌పై మహిళ ప్రతాపం - ఠాణాలో పరస్పర ఫిర్యాదులు - WOMAN FIGHTS WITH RTC CONDUCTOR - WOMAN FIGHTS WITH RTC CONDUCTOR
🎬 Watch Now: Feature Video


Published : Aug 1, 2024, 10:24 AM IST
Woman Fights With RTC Conductor in Hanamkonda : ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు, కండక్టర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా డ్రైవర్ పక్కనున్న బానెట్‌పై మహిళ కూర్చుంటే కండక్టర్ వారించడమే ఈ వివాదానికి కారణమని సమాచారం. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ జరిగింది : హనుమకొండ నుంచి ములుగు జిల్లాకు వెళ్తున్న బస్సులో కమలపూర్కు చెందిన మహిళ ప్రయాణించింది. ఈ క్రమంలో ఆత్మకూరు శివారులో డ్రైవర్ పక్కన బానెట్‌పై కూర్చోవడానికి ప్రయాణికురాలు యత్నించింది. దీంతో బానెట్‌పై కూర్చోవద్దని మహిళను కండక్టర్ వారించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.
ఆత్మకూరులో జాతీయ రహదారి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై కండక్టర్ చేయిచేసుకున్నాడని ప్రయాణికురాలు లలిత ఫిర్యాదు చేసింది. మరోవైపు తనను తీవ్ర పదజాలంతో దూషించారని కండక్టర్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తామని సీఐ నచ్చచెప్పి వారిద్దరినీ పంపించారు. బస్సు ఏటూరునాగారం వైపు వెళ్తుండగా లలిత, తన కుమారుడు మోహన్‌తో కలిసి బస్సును వెంబడించారు. మల్లంపల్లి వద్ద బస్సు ఆపి కండక్టర్ పై లలిత కుమారుడు మోహన్ దాడి చేశారు. దీంతో కండక్టర్, బస్సు డ్రైవర్ ములుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.