పొలంలో 13 అడుగుల భారీ కొండచిలువ- 7 గంటలు శ్రమించి పట్టుకున్న అధికారులు - 13 feet python in Karnataka - 13 FEET PYTHON IN KARNATAKA
🎬 Watch Now: Feature Video
Published : Mar 27, 2024, 10:41 AM IST
13 feet python in Karnataka : 13 అడుగుల పొడవైన కొండ చిలువను 7 గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు అటవీ అధికారులు. ఈ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో మార్చి 23న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
కడబా తాలుకాలోని కొడింబాళ గ్రామంలో మార్చి 23న ఓ రైతు తన పొలంలో రబ్బరు తీస్తుండగా పాము బుస కొడుతున్న శబ్దం వినిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పాము కోసం వెతుకుతుండగా ఓ చెట్టుపై భారీ కొండ చిలువ కనిపించింది. వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోపాల్ అనే స్నేక్ క్యాచర్ ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్థుల సాయంతో కొండ చిలువను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టాడు. అలా సుమారు 7 గంటల పాటు తీవ్రంగా శ్రమించి కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం అటవీ అధికారులు సురక్షితంగా అడవిలో వదిలి పెట్టారు. అయితే పామును పట్టుకునే సమయంలో ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని గోపాల్ తెలిపారు.