ETV Bharat / state

సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం - Free Electricity Scheme Launch 2024

Two Guarantees Launch in Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం గ్యారంటీలను అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సచివాలయం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించారు.

Two Guarantees Launch in Telangana 2024
Two Guarantees Launch in Telangana 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 4:29 PM IST

Updated : Feb 27, 2024, 5:13 PM IST

సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం

Two Guarantees Launch in Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో రెండు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ (Free Electricity Scheme Launch 2024), మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

500 LPG Cylinder Scheme Launch : అయితే మొదట ఈ రెండు పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదికగా ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సచివాలయంలో రెండు గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా పాలనలో (Praja Palana in Telangana) దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను వర్తింపచేయనున్నట్లు తెలిపారు.

'మహాలక్ష్మి'కి గుడ్ న్యూస్ - రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం జీవో విడుదల

Minister Uttam On Two Guarantees : అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్‌ సిలిండర్ ధర భారీగా పెరిగిందని అన్నారు. పెరిగిన ధరల నుంచి మహిళలకు ఊరట కల్పించాలని భావించామని, అందుకే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ స్కీమ్‌తో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. లోపాలు గుర్తించి పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని వెల్లడించారు. త్వరలో నేరుగా లబ్ధిదారులు రూ.500కే సిలిండర్‌ పొందేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని చెప్పిన భట్టి, ఇవాళ మరో రెండు గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. పేదలకే ఎక్కువ ఉపయోగం కలిగేలా ఆరు గ్యారంటీలు ప్రకటించామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాల వైపు దేశమంతా చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు.

"ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేం చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్‌ తన హామీలను అమలు చేయదని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసింది. అన్ని గ్యారంటీల అమలు కోసం నిత్యం కృషి చేస్తున్నాం. పేదలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ గ్యారంటీలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తాం. 200లోపు యూనిట్లు వాడే అందరికీ మార్చిలో జీరో బిల్లు వస్తుంది. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. మండల కార్యాలయాల్లోకి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చు." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

రూ.500కే గ్యాస్​ సిలిండర్​పై క్లారిటీ వచ్చేసింది​ - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!

హైదరాబాద్​లో 11 లక్షల మందికే ఫ్రీ కరెంట్! - మరి ఆ దరఖాస్తులన్నీ ఏమైనట్లు?

Last Updated : Feb 27, 2024, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.