ETV Bharat / state

అమాయక మహిళలే టార్గెట్​ - కోరిక తీర్చుకుని కిరాతకంగా చంపేస్తాడు - కానీ? - MAN KILLED 6 WOMEN IN MAHABUBNAGAR - MAN KILLED 6 WOMEN IN MAHABUBNAGAR

Man Who Killed 6 Women : ఆరుగురు మహిళలను అతి కిరాతకంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూలీలు, అమాయక మహిళలకు మాయమాటలు చెప్పి నమ్మించి, శారీరకంగా అనుభవించి హత్యకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Man Who Killed 6 Women
Man Who Killed 6 Women (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 11:24 AM IST

Updated : Jun 30, 2024, 11:48 AM IST

Man Who Killed 6 Women : మాయమాటలు చెప్పి ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం తన కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్‌ ఖాసీం(25) పొట్టకూటి కోసం కూలీగా పని చేస్తుండేవాడు. అతడు మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడ్డ అతడు రెండున్నరేళ్ల క్రితం మహబూబ్​నగర్​కు మకాం మార్చాడు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్ల దగ్గర, ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కూలీలు, అమాయకులైన మహిళలే లక్ష్యంగా మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తానని నమ్మించి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు.

ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేసి : ఈ విధంగా ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23న మహబూబ్‌నగర్‌ పట్టణం పరిధిలోని టీడీగుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను లొంగదీసుకుని శారీరకంగా అనుభవించాడు. అనంతరం ఆమె డబ్బులు ఇవ్వాలని అడగ్గా తన వద్ద ఉన్న టవల్‌ను ఆమె మెడకు చుట్టి బ్లేడుతో గొంతు కోశాడు. రాయితో ముఖంపై మోదీ చంపేసి ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను కాజేసి పరారయ్యాడు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు : మే 24న మృతదేహాన్ని గుర్తించిన భూత్పూర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రోజున మహబూబ్‌నగర్‌ షాసాబ్‌గుట్ట వద్ద నిందితుడు కాసమయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2022 నుంచి ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు అంగీకరించాడు. భూత్పూర్‌ పరిధిలో ఇద్దరు మహిళలను, హన్వాడ, వనపర్తి, బిజినేపల్లి, మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణాల పరిధిలో ఒక్కొక్కరిని హత్య చేశాడని, కాసమయ్యపై కేసులు నమోదుచేసి రిమాండ్‌ కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.

సంగారెడ్డిలో దారుణం - బాలుడిని చంపి, సెల్​ టవర్​ పైకెక్కి ఉరేసుకున్న రౌడీ షీటర్‌ - Rowdy Sheeter Killed 13 years Boy

రంగారెడ్డి జిల్లాలో విషాదం - ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

Last Updated : Jun 30, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.