Telangana High Court on Hydra : జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. హైడ్రా ఇండిపెండెంట్ బాడీ అని ఏఏజీ చెప్పారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల తీరును ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొన్న హైకోర్టు, 15-20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణమని కూల్చివేయడమేంటని వ్యాఖ్యానించింది.
Telangana High Court on Hydra Demolitions అనంతరం ఏఏజీ మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా తీసుకువచ్చామని హైకోర్టుకు తెలిపారు. అయితే హైడ్రా పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదన్న న్యాయస్థానం కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. ప్రదీప్‌రెడ్డి వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. జన్వాడలో ఉన్న ఫాంహౌజ్ జీవో 111లోకి వస్తుందని పేర్కొన్నారు. జీవో 111 పరిధిలోకి భూములు, ఫాంహౌజ్‌లు నీటిపారుదల శాఖ చూస్తుందని, జీవో 111 పరిధిలోని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
అసలేం జరిగింది : జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. జన్వాడ ఫాంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్‌రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజినీర్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు.
చిత్రపూరి కాలనీలో అక్రమ విల్లాలు కూల్చివేత : రెండో రోజు హైడ్రా రంగారెడ్డి జిల్లాలోని మణికొండ చిత్రపూరి కాలనీలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో విల్లాల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు, పోలీసు బందోబస్తుతో కూల్చివేస్తున్నారు.
ఆక్రమణలపై హైడ్రా హై నజర్ - కబ్జా అని తేలితే కూల్చేయటమే! - HYDRA OPERATIONS