2:17 PM
రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఏం సంబంధం: పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ భాషను సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నారు.
2:13 PM
రేవంత్ మాటలకు సమాధానం ఇవ్వగలం కానీ మాకు పార్లమెంటరీ సంప్రదాయాల మీద గౌరవం ఉంది: కడియం
అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని కడియం శ్రీహరి అన్నారు. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని, రికార్డుల నుంచి తొలగించాలని కోరితే స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదు ఆందోలన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి భాషకు దీటుగా బదులు ఇవ్వగలమన్నారు. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద తమకు గౌరవం ఉందని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. కంచెలు తొలగిస్తామని ఇదేం కంచెల పాలనా? విరుచుకుపడ్డారు
1:40 PM
కేంద్రం నెరుగా సీబీఐ విచారణ చేసేందుకు వీలు కాదని శ్రీధర్‌బాబుకు తెలియదా?: మహేశ్వర్‌రెడ్డి
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే సీబీఐ విచారణకు ఎవ్వరు అడ్డపడ్డారని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాబట్టే విచారణకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. మేము చెప్పినట్లు జ్యుడిషియల్ విచారణకు ముందుకు వచ్చామని తెలిపారు. అనంతరం స్పందించిన మహేశ్వర్‌రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణకు కోర్టు నిరాకరించిందని చెప్పారు. కోర్టు నిరాకరించినా సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. కేంద్రం నెరుగా సీబీఐ విచారణ చేసేందుకు వీలు కాదని శ్రీధర్‌బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి లేఖ ఇవ్వండని, లేఖ ఇచ్చిన 48 గంటల్లో సీబీఐ విచారణ ప్రారంభం కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా? అని మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు
1:30 PM
అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చోని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మీడియా పాయింట్‌కు వెళ్లే మార్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం అంటూ వారు నినాదాలు చేశారు. బారికేడ్లు తోసేందుకు ఎమ్మెల్యేల యత్నించారు. అరెస్టు చేస్తే చేసుకోండని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు.
1:25 PM
అసెంబ్లీలో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలకు ఆంక్షలు విధించారా?: హరీశ్‌రావు
ఇనుప కంచెలు తీసివేశామన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకని కడియం శ్రీహరి ప్రశ్నించారు. అనుమతి ఇస్తారా? కంచెలు బద్దలు కొట్టాలా? అని మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కడం, ఇక్కడా గొంతు నొక్కడమేనా? హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో 3000ల నుంచి 4000ల మంది పోలీసులను మోహరించారని అన్నారు. అసెంబ్లీలో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలకు ఆంక్షలు విధించారా? అని ఆయన పేర్కొన్నారు.
1:19 PM
అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్యాదం
శాసనసభ లాబీల్లో నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న సమయంలో మార్షల్స్, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్యాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదన్న పోలీసులు తెలిపారు. సభలో అవకాశం ఇవ్వరు మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా? అంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సీఎం స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
1:00 PM
'బీఆరఎస్ నడిచిన బాటలోనే కాంగ్రెస్ నేతలు నడుస్తున్నారు'
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారుయ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టే బడ్జెట్ అని ఆరోపించారు.
12:56 PM
గత ప్రభుత్వం రూ.40కోట్ల అప్పు, ఈ ప్రభుత్వం రూ.60 తీసుకొస్తా అంటుంది: మహేశ్వర్ రెడ్డి
గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల అప్పు తీసుకువచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.60 వేల కోట్ల అప్పు తీసుకువస్తుందని చెబుతుందని మండిపడ్డారు
12:45 PM
సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు. అధికార కాంగ్రెస్ వైఖరికి నిరసనగా సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
12:40 PM
రాజ్‌గోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యాలు చేస్తే రికార్డు నుంచి తొలగించాల్సిందే :శ్రీధర్ బాబు
రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే రికార్డు నుంచి తొలగించాల్సిందేనని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రికార్డులను పరిశీలించి కడియం శ్రీహరిపై రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తొలగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.
12:29 PM
కృష్ణా, గోదావరి జలాలపై శ్వేతపత్రంపై చర్చకు సిద్ధం : కడియం
కృష్ణా, గోదావరి జలాలపై శ్వేతపత్రంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కడియం శ్రీహరి అన్నారు. సీఎం వాడే భాషపై మాకు అభ్యంతరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని విషయాల అయినా మాట్లాడవచ్చని తెలిపారు. సీఎంగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా నిండు శాసనసభలో రేవంత్‌రెడ్డి సహనం కోల్పోతే ఎలా? ప్రశ్నించారు. సీఎం వాడరాని భాష మాట్లాడితే సరికాదన్నారు.
12:25 PM
'నిజాయితీ అంటే అవినీతికి పాల్పడకుంటే కేసీఆర్ సభలోకి రావాలి'
మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపైనిర్ణయం తీసుకునేలా చర్చించేందుకు కేసీఆర్ సభకు రావాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. మేడిగడ్డలో వాస్తవాలపై చర్చకు పిలిచారు. సాగునీటి ప్రాజెక్టుపై శ్వేతపత్రం పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారం. ప్రతిపక్షం అభిప్రాయాలు శ్వేతపత్రంపై చర్చలో చెప్పుకోవచ్చని అన్నారు. కాళేశ్వరంపై ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
12:20 PM
చచ్చిన పాములు ఎవరు చంపుతారు: సీఎం రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు వస్తే రేపు సాయంత్రం వరకు చర్చిద్దామని సవాల్ విసిరారు. అవినీతి బయటపడుతుందనే పారిపోయి ఫాంహౌస్‌లో వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యతను తప్పించుకున్నారని అన్నారు. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉందని, సానుభూతి కోసం వీధి నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు. చచ్చిన పామును ఎవరూ చంపుతారని తెలిపారు
12:15 PM
సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తాం: రేవంత్ రెడ్డి
నల్గొండలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతా? అని అడిగారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. సాగునీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తామన్నారు. మేడిగడ్డలో ఎలా నీరు నింప్పుతారో ఎలా ఎత్తి అన్నారం, సుందిళ్లకు పంపిస్తారో చూద్దామని తెలిపారు.
12:11 PM
కేసీఆర్‌పై కోసంతో రైతులను ఇబ్బంద పెట్టొద్దు: కేటీఆర్
కడియం శ్రీహరిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలి కేటీఆర్ అన్నారు. వాళ్లు 64 మంది ఉన్నారు తాము 39 మంది సభ్యులం ఉన్నారని కేటీఆర్‌అధికార పక్షం వారు అడగగానే మైకు ఇస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగిపోయిన చోట మరమ్మతులు చేయించి రైతులకు నీరు ఇవ్వండి కోరారు. కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దు మండిపడ్డారు.
12:07 PM
నేను హోంమంత్రి అయితానో లేదో తెలియదు కానీ నీవు మాత్రం జన్మలో మంత్రివి కావు : రాజ్‌గోపాల్ రెడ్డి
అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారినా వారి బుద్ధి మారలేదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి మాట్లాడితే కూర్చోమని కేటీఆర్ అంటారా? అని మండిపడ్డారు. ఎంత అహంకారం కేటీఆర్‌కు మార్పు కోసమే ప్రజలు అక్కడికి పంపించారని అన్నారు. తాను హోంమంత్రి అయితానో లేదో తెలియదు కానీ నీవు మాత్రం జన్మలో మంత్రివి కావని జోస్యం చెప్పారు.
12:01 PM
రాష్ట్ర చిహ్నాం మార్పుపై మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం: కడియం
జయ జయహే రాష్ట్రం గీతంగా కేబినెట్ ఆమోదించిందని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర చిహ్నాం మార్పుపై మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. పథకాల పేరు మార్చుతున్నారు ఇబ్బంది లేదని తెలిపారు. రాష్ట్ర చిహ్నాంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉందని కడియం చెప్పారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి చిహ్నాలు. కాకతీయ తోరణం, చార్మినార్ కేసీఆర్ కట్టింది కాదు. జయ జయహే తెలంగాణ గీతంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ప్రాశస్త్యాన్ని కోనియాడారు. మంత్రివర్గం ఆమోదించిన రాష్ట్ర గీతంలో చిహ్నాలు చెరిపివేస్తారా? రాష్ట్ర చిహ్నాంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కడియం శ్రీహరి అన్నారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను రాజరికపు ఆనవాళ్లు అంటున్నారని అధికారిక చిహ్నాంలో ఉన్న నాలుగు సింహాలు ఎక్కడినుంచి వచ్చాయి ప్రశ్నించారు. మనం వినియోగించే అశోక ధర్మ చక్రం ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు. నాలుగు సింహాలు, అశోక ధర్మ చక్రం రాజరిక ఆనవాళ్ల కాదా? పంద్రాగస్టు రోజు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేస్తాం.. అది రాచరికపై ఆనవాళ్లు కావా? అంటూ నిలదీశారు.
11:55 AM
ఈ హామీలు ఎందుకు బడ్జెట్‌లో పెట్టలేదు: కడియం
నిరుద్యోగ యువతకు రూ.4 వేలు ఇస్తామన్నారని బడ్జెట్‌లో ప్రస్తావన లేదని బీఆరఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారని గుర్తు చేశారు. బడ్జెట్‌లో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రసావన చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు బి.ఆర్.అంబేడ్కర్ అభయ హస్తం పేరుతో రూ.12 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారని కడియం తెలిపారు. దళిత బంధునే బీ.ఆర్.అంబేడ్కర్ అభయ హస్తంగా మార్చారని అన్నారు. బడ్జెట్‌లో దాని గురించి లేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఐదేళ్లలో లక్ష కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారని, ఏడాదికి రూ.20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామన్న బీసీ సబ్ ప్లాన్‌ను బడ్జెట్‌లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.
11:50 AM
మేడిగడ్డ కుంగిపాటు అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు : కడియం
కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కెనాళ్లు, సబ్‌స్టేషన్‌లు ఉన్నాయని కడియం శ్రీహరి గుర్తు చేశారు. కాళేశ్వరంలో ఒక భాగమైన మేడిగడ్డలో కేవలం 2,3 పిల్లర్లు కుంగిపోయాయన్నారు. కుంగిపాటు అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోండి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. మేడిగడ్డలో దెబ్బతిన్న భాగాన్ని వెంటనే మరమ్మత్తులు చేయాలని చెప్పారు. మేడిగడ్డ కుంగిన ప్రాంతం, ఇప్పటి వరకు చేయాల్సినంత రాజకీయ చేశారని మండిపడ్డారు. ప్రజల కోణం నుంచి ఆలోచించి మేడిగడ్డకు మరమ్మత్తులు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విద్యుత్, వైద్య రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోతే వచ్చే వరదలకు మరింత నష్టం జరుగుతుందని చెప్పారు.
11:26 AM
ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎల్లంపల్లి, లోయర్ మానేరు ఎవరూ కట్టారు తెలుసుకోవాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.
11:25 AM
కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకున్నామని కడియం శ్రీహరి అన్నారు.
11:18
రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు : కడియం శ్రీహరి
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు ఇప్పటికీ చేయలేదని కడియం శ్రీహరి అన్నారు. రైతు రుణమాఫీని ఏవిధంగా ఎప్పటిలోగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టతోపాటు స్థిరీకరణ జరిగిందన్నారు. కాళేశ్వరం విషయంలో గొరంతను కొండంత చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు.
11:10 AM
బీఆర్ఎస్ పాలనలో పరిశ్రమలు, ఐటీ నుంచి 26లక్షల ఉద్యోగాలు ఇచ్చాము : కడియం శ్రీహరి
చేయూత పథకానికి ఏడాదికి రూ.30వేల కోట్లు కావాలని కడియం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పరిశ్రమలు, ఐటీ నుంచి 26లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఐటీకి కేటీఆర్ ఆలోచనలతో గమ్యం చేరిందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారని గుర్తు చేశారు. కేవలం ఇంటికి ఒక్కరికే రూ.2500 ఇచ్చిన రూ.20 వేల కోట్లు అవసరమన్నారు. రూ.2500 ఇచ్చే అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
11:02 AM
రుణమాఫి చేస్తామన్నారు అదే అడుగుతున్నాం : కడియం
డిసెంబర్ 9 న రైతు రుణమాఫీ చేస్తామన్నారు అదే తాము అడుగుతున్నామని కడియం శ్రీహరి అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమన్నారు. రుణమాఫీ సహా కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లకు అయ్యే వ్యయం అదనం అని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారని 119 నియోజకవర్గాల్లో 4.16 లక్షల ఇళ్లకు రూ.24 వేల కోట్లు అవసరం అన్నారు. బడ్జెట్‌లో ఇళ్ల కోసం కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారని తెలిపారు.
10:59 AM
హమీలు అమలు చేయవద్దన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ ఉంది: శ్రీధర్ బాబు
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే అమలు చేయడం లేదని రాద్ధాంతం బీఆర్ఎస్ చేస్తుందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది హామీలు అమలు చేసితీరుతాం శ్రీధర్‌బాబు స్పష్టం గుర్తు చేశారు. హామీలు అమలు చేయవద్దన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు.
10:55 AM
లోక్‌సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చెతులెత్తేసే పనిలో కాంగ్రెస్ : కడియం శ్రీహరి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 హామీలు ఉన్నాయని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ సరిపోదని తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లోకూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాగానే హామీల విషయంలో చెతులెత్తేసే పనిలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు.
10:50 AM
'కేసీఆర్ పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగింది'
బీఆర్ఎస్్పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణంకాలు చదివి వినిపించిన కడియం శ్రీహరి. కేసీఆర్ పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం పేరిట అనేక హామీలు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువత, మైనార్టీ, మహిళ, రైతు డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు.
10:44 AM
గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే బడ్జెట్ పెట్టారు : కడియం శ్రీహరి
బడ్జెట్‌లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని కడియం శ్రీహరి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబుతునే ఆర్థిక వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉందని చెప్పారని తెలిపారు. ఒక పేజీలో పుట గడవలేని, జీతాలివ్వాలేని పరిస్థితి అని రాశారన్న ఆయన మరో పేజీలో కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం పెరిగిందని, జీఎస్‌డీపీ పెరిగిందని చెప్పారని అన్నారు. ఒక వైపు ఆర్థిక మాద్యం వస్తుంది, ఆదాయ పడిపోయింది వనరులు సరిగా లేవన్నారని చెప్పారు. మరో వైపు రూ.51 వేల కోట్ల బడ్జెట్ పెంచి చూపుతున్నారని మండిపడ్డారు. ట్యాక్స్ రెవెన్యూ రూ.20 వేల కోట్లు పెంచి చూపించారని ట్యాక్స్ రెవెన్యూ ఎలా పెంచుతారో వివరించలేదని ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యం అంశంపై ప్రత్యేకంగా చర్చ పెడదాం : శ్రీధర్ బాబు
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించాలని శ్రీధర్ బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీలు గౌరవంగా బతుకుతున్నారంటే అంది కాంగ్రెస్ వల్లనే అన్న ఆయన విపక్ష సభ్యులు ఇందిరమ్మ రాజ్యం అంశంపై ప్రత్యేకంగా చర్చిద్దామని తెలిపారు.
10:39 AM
బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైనే మాట్లాడుతున్నానని కడియం శ్రీహరి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకే కుటుంబం కోసం పనిచేస్తుంది విమర్శించారు.
10:37 AM
'వాళ్లు లేకపోతే దేశం అభివృద్ధి చేందేదా'
బడ్జెట్‌పై మాట్లాడమని కడియంకు అవకాశమిస్తే సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇందిరమ్మను ఇప్పటికీ దేవతగా గుర్తుచేసుకుంటారని తెలిపారు. నెహ్రూ, ఇందిరమ్మ లేకపోతే దేశం అభివృద్ధి చెందేదా? అని ప్రశ్నించారు. ఆధునిక దేవాలయాల వంటి ప్రాజెక్టులు వచ్చేవా అని అడిగారు.
10:31 AM
తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది: కడియం
తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని తెలిపారు. నియంతృత్వ, నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మరచిపోయారన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎమర్జెన్సీ చీకటిరోజులు మరచిపోయినట్లున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదు మండిపడ్డారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 404 స్థానాలు గెలుచుకుందన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదని గుర్తు చేశారు.
10:29 AM
బడ్జెట్ ప్రవేశపెడుతూ తెలంగాణ ఇచ్చిన యూపీఏ, సోనియాకు కృతజ్ఞతలు కడియం శ్రీహరి చెప్పారు. మలిదశ ఉద్యమ నాయకులు, కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరమన్నారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం చేశారని తెలిపారు. 2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ అన్నారు.
10:26 AM
దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్న కడియం శ్రీహరి. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్సే దీనికి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ కూడా కృతజ్ఞతలు కడియం శ్రీహరి తెలిపారు.
10:25 AM
ఒకేఒక్క అధికారి మాత్రమే సభలో ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు. సభ నిర్వహణలో ప్రభుత్వానికి తగిన శ్రద్ధ లేదని మండిపడ్డారు.
10:23 AM
ఆర్థిక శాఖమంత్రి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమ మంత్రివర్గ సహచరులు సభలోనే ఉన్నామని తెలిపారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా ఉన్నారని చెప్పారు.
10:22 AM
కోరం లేకపోవడం వల్ల సభ సమయపాలన బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న ఈ సమయంలో సీఎం, ఆర్థిక మంత్రి ఇద్దరూ లేరని కడియం శ్రీహరి మండిపడ్డారు. సమయంలో ఇద్దరూ లేకపోవడం ప్రభుత్వ తీరును ఉదహరిస్తోంది ఎద్దేవా చేశారు.
10:18 AM
శాసనసభలో కోరం లేదంటూ అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. కోరం ఉందని చెప్పిన మంత్రి శ్రీధర్‌బాబు. కోరం లేకుండా సభ నిర్వహణ సరికాదన్న బీఆర్ఎస్ సభ్యులుప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారన్న మండిపడిన శ్రీధర్ బాబు. కోరం పూర్తిస్థాయిలో ఉందన్న శ్రీధర్‌బాబు. హరీష్‌రావుకు పూర్తిస్థాయి ప్రొసీజర్ తెలిసినా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కోరం అంటే 12 మంది సభ్యులు ఉంటే చాలన్న శ్రీధర్‌బాబు. ముందుగా ప్రకటించిన సమయానికే సభ ప్రారంభించాలని బీఆరఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుర్తు చేశారు. సభ నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్న ఆయన సభ నాలుగైదు నిమిషాలు ఆలస్యం చేయడం సరికాదన్నారు.
10:13 AM
వ్యాగ్వాదంతో మొదలైన అసెంబ్లీ సమావేశం. కోరం లేదని అధికార, విపక్షాల మధ్య మాటలు. సభ నడవాలని మేము చూస్తున్నామని తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. అసెంబ్లీలో సమయ పాలన పాటించాలన్న కడియం శ్రీహరి
Telangana Budget Live Updates : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఇవాళ ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి ఈనెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జులై నెల వరకు అవసరాల కోసం రూ.78,911 కోట్ల పద్దును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రతిపాదించారు. దానిపై ఇవాళ శాసనసభ, మండలిలో చర్చ జరుగుతోంది. చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఇవాళ్టి ఎజెండాలో పొందుపరిచారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయంపై కూడా చర్చిస్తున్నారు.