ETV Bharat / state

కొనసాగుతున్న ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన - ఇన్​ఛార్జి వీసీ రాజీనామా చేయాలని డిమాండ్​ - RGUKT Students Protest - RGUKT STUDENTS PROTEST

RGUKT Basara Students Protest : ఇన్​ఛార్జి వీసీ రాజీనామా చేయాలంటూ నాలుగైదు రోజులుగా బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా శాశ్వత వీసీని నియమించాలంటూ డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు తీవ్రమైంది. యూనివర్సిటీలో సైతం అభివృద్ధికి నోచుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.

RGUKT IIIT Students protest over VC
RGUKT Basara Students Protest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 2:11 PM IST

Updated : Sep 9, 2024, 3:54 PM IST

RGUKT IIIT Students protest over VC : నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతోంది. ఇన్​ఛార్జి వీసీ వెంకటరమణ రాజీనామా చేయాలంటూ నాలుగైదు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా శాశ్వత వీసీని నియమించాలని డిమాండ్​ చేస్తున్నారు. రెండేళ్లుగా వీసీ, డైరెక్టర్ చేసిన ఆర్ధిక వ్యవహార అంశాలను సైతం బహిర్గతం చేయాలని, ఏళ్లుగా కొనసాగుతున్న మెస్ కాంట్రాక్టులను రద్దు చేసి వాటికి కేటాయించిన నిధుల వివరాలు వెల్లడించాలని కోరుకుంటున్నారు. బోధన, బోధనేతర విభాగాల్లో శాశ్వత నియామకాలు చేపట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై స్వతంత్ర కమిటీని నియమించాలని డిమాండ్​ చేస్తున్నారు.

విద్యార్థులు తెర మీదకు తెస్తున్న సమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం లేకపోవటంతో ఆందోళనలకు దారితీస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022 జూన్​లో నెలరోజుల పాటు విద్యార్థులు మూకుమ్మడిగా ఆందోళన నిర్వహించటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, అప్పటి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్, నాటి గవర్నర్​ తమిళిసై వేర్వేరుగా విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. చివరికి అప్పటి ప్రభుత్వం దిగివచ్చి కేటీఆర్ నేతృత్వంలోని సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డితో కూడిన బృందం ఆర్జీయూకేటీని సందర్శించింది.

ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా : నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని అప్పటి మంత్రులు భరోసా ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత పాలకులు పట్టించుకోలేదు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టీఎస్ఏఎస్) పేరిట ఏర్పడిన సంఘం నాలుగు రోజులుగా ఆర్జీయూకేటీలోని పరిపాలనా భవనం ఎదుట నిరసన చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అధికారులు తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయటం వివాదాస్పదమవుతోంది.

'క్యాంపస్​లో ఆందోళన చేస్తున్న టీఎస్ఎఎస్ సంఘానికి గుర్తింపు లేదు. రెండు, మూడేళ్లుగా పరీక్షల్లో విఫలమవుతూ, కనీసం బకాయిలు సైతం చెల్లించటం లేదు. క్యాంపస్​లో చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్న కొంతమంది విద్యార్థులు ఇతర విద్యార్థుల చదువులకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొందరు విద్యార్థులను సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశాం. వారిచ్చే సమాధానాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం'- వెంకటరమణ, వీసీ

ఆర్జీయూకేటీ ఏర్పడిన 2008 నుంచి చేసిన ఖర్చుల్లో పారదర్శకత కొరవడింది. 2014-18 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం కేటాయించిన రూ.160 కోట్ల కార్పస్ ఫండ్ లెక్క తేల్చలేదు. క్యాంపస్​లో అవసరం లేకున్నా రూ.60 కోట్లతో కొనుగోలు చేసిన వస్తువుల జాడే లేదు. దాని వెనుక ఉన్నదెవరు? ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికీ తేలలేదు.

బాసర ఆర్జీకేయూటీకీ గవర్నరే ఛాన్స్‌లర్ - వర్సిటీ చట్టంలో సవరణకు సర్కార్ సన్నాహాలు!

Last Updated : Sep 9, 2024, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.