ETV Bharat / state

పార్ట్​ టైమ్ జాబ్స్​ పేరిట మీకూ ఇలాంటి వాట్సాప్ కాల్స్ వచ్చాయా? - అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే - Part Time Job Scam in hyderabad

Online Job Fraud in Hyderabad : అంతర్జాతీయ కోడ్​​ నంబర్లతో వాట్సాప్​ వీడియో కాల్స్, వాయిస్​ కాల్స్​ ​ వస్తున్నాయా? పార్టు టైం జాబ్స్​ పేరుతో మీ డీటెయిల్స్​ వారికి ఇస్తున్నారా? అయితే మీరు పూర్తిగా మోసపోయినట్లే. ఎందుకంటే పార్ట్​టైం జాబ్స్​ చెప్పి ఇలా లక్షల్లో సైబర్​ కేటుగాళ్లు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్​లో చాలానే జరుగుతున్నాయి.

Online Job Fraud in Hyderabad
Online Job Fraud in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 9:59 AM IST

Part Time Job Scam in Hyderabad : పార్ట్​ టైం ఉద్యోగాల పేరుతో సైబర్​ కేటుగాళ్లు ఎంతో మందిని బురిడీ కొట్టిస్తున్నారు. అందుకు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటూ వేలు, లక్షల్లోనూ కాజేస్తున్నారు. తాజాగా ఇంటర్నేషనల్​ కాల్స్​ కోడ్​తో వాట్సాప్​ వీడియోకాల్​ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన సైబర్​ మోసగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

బంజారాహిల్స్​ వాసి దినేశ్​కు +84 కోడ్​తో మొదలయ్యే నంబర్​ నుంచి వాట్సప్​ వీడియో కాల్​ వచ్చింది. అది విదేశీ నంబరు కావడంతో అనుమానం వచ్చి మొదట్లో అతను ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. మళ్లీ కొంతసేపటికి మళ్లీ అదే నంబర్​ నుంచి వీడియో కాల్​ రావడంతో ఎత్తి మాట్లాడారు. ఆన్​లైన్​ ద్వారా తాము అప్పగించిన పనిని చేస్తే రోజుకు రూ.వేలల్లో సంపాదించవచ్చని కాల్​ చేసిన వ్యక్తి చెప్పాడు. అతని మాటలు విన్న దినేశ్​ ఆ మాటలను నమ్మి రిజిస్ట్రేషన్​ రుసుం పేరిట రూ.54 వేలు చెల్లించాడు. ఎంతకీ అటునుంచి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇప్పుడు దినేశ్​ ఒక్కడే కాదు హైదరాబాద్​లో వందల సంఖ్యలో వాట్సప్​ వినియోగదారులకు కొద్దిరోజులుగా ఇదే తరహాలో వాయిస్​, వీడియో కాల్స్​ సర్వసాధారణం అయిపోయాయి. ఎక్కువగా +60(మలేసియా), +251(ఇథియోపియా), +62(ఇండోనేషియా), +254(కెన్యా) తదితర విదేశీ నంబర్ల నుంచి కొద్ది రోజులుగా దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఈ తరహా కాల్స్​ ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఎందుకంటే విదేశాలకు వెళ్లి కొద్దిరోజులు ఉండేవారి కోసం కొందరు సర్వీసు ప్రొవైడర్లు విదేశీ నంబర్లను తాత్కాలికంగా కేటాయిస్తున్నారు. దీనినే నేరగాళ్ల ముఠాలు అవకాశంగా వినియోగించుకున్నారు. ఆయా నంబర్లతో వాట్సప్​ రిజిస్టర్​ చేశాక సిమ్​ వినియోగించకపోయినా వాట్సప్​ పనిచేసే అవకాశం ఉండటంతో కాల్​ స్పూఫింగ్​ ద్వారా నేరాలకు వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది.

ఆ​ యాప్​పై సైబర్​ దాడి​- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!

సాఫ్ట్​వేర్​ ఆధారిత కాల్స్​ : వాట్సప్​లో వాయిస్​, వీడియోకాల్స్​ వందల మందికి వరుసపెట్టి వస్తుండటంపై సైబర్​ భద్రత నిపుణులు ఆరా తీశారు. దీని వెనుక సాఫ్ట్​వేర్​ ఆధారిత టూల్స్ ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. సైబర్​ కేటుగాళ్లు వేల నంబర్లను ఆ టూల్స్​కు అనుసంధానం చేస్తే, ఆ నంబర్లకు ఫోన్​ చేసినా ఎస్​ఎంఎస్​లు పంపినా అవతల వ్యక్తులకు విదేశీ నంబర్లుగానే కనిపిస్తాయి. కానీ చేసేది మాత్రం దేశంలోని ఉత్తరాది ముఠాలేనని భద్రత నిపుణుల విచారణలో వెల్లడైంది. ఆయా నంబర్లకు ఫోన్​ చేస్తే హిందీలో మాట్లాడటం లేదా ఆంగ్లంలో మాట్లాడినా విదేశీ యాస లేకపోవడంతో ఆముఠాలేనని నిర్ధారించారు.

రిక్‌విన్‌ అస్త్రంతో ఉపశమనం : గుర్తు తెలియని విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్​ వాయిస్​, వీడియోకాల్స్​ వస్తే స్పందించకపోవడమే ఉత్తమమని టీఎస్​సీఎస్​బీ ఎక్స్​ వేదికగా అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికాం, తెలంగాణ స్టేట్​ సైబర్​ సెక్యూరిటీ బ్యూరోలు అప్రమత్తమయ్యాయి. ఆ నంబర్లతో వచ్చే కాల్స్​ను బ్లాక్​ చేయడం గానీ, వాట్సాప్​ తాజా అప్​డేట్​లను ఫాలో అవ్వడం చేస్తే ఉత్తమం. డీవోటీ ఆధ్వర్యంలో ఉన్న సంచార్​ సాథి పోర్టల్​లో రిపోర్ట్​ ఇన్​కమింగ్​ ఇంటర్నేషనల్​ కాల్​ విత్​ ఇండియన్​ నంబర్(రిక్​విన్​) ఫీచర్​ను తెచ్చింది. అలాంటి కాల్స్​ను రిసీవ్​ చేసుకున్న బాధితులు ఆ పోర్టల్​లోకి వెళ్లి ఫిర్యాదు చేయడం ద్వారా డీవోటీ నిఘా ఉంచుతుంది.

బ్యాంక్స్​ మాస్టర్​ ప్లాన్ - ఇకపై క్షణాల్లో సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ ఫ్రీజ్​!

ఫేక్​​ ఫ్రెండ్​ - మహిళకు రూ.42 లక్షలు టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.