Ration Cards In Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఇంకా సభలు జరగడం లేదు. నగరంలో రేషన్ కార్డుల మంజూరులో జాప్యం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో మాదిరే గణతంత్ర దినోత్సవం రోజున నగరంలో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవలె కులగణన సర్వేలో రేషన్ కార్డు కోసం అర్జీ పెట్టుకున్న 83 వేల మంది అర్హతల పరిశీలనను మంగళవారంతో పూర్తి చేసింది. అయితే ఇటీవలె ప్రజాభవన్‌కు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు సుమారు లక్షమంది కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
సర్వే పూర్తయినా ఆగని దరఖాస్తులు : దీంతో ముందు అనుకున్నట్లు జనవరి 26 న రేషన్ కార్డులు జారీ చేస్తే వారంతా అసంతృప్తి చెందుతారని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. కొంత ఆలస్యం చోటుచేసుకున్నప్పటికీ అందరికీ న్యాయం చేయాలని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పష్టం చేశారు. ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులని గుర్తిస్తామని అన్నారు.
రేషన్‌కార్డులు ఆలస్యం : అర్హుల పరిశీలన మరో వారం కొనసాగుతుందని పిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవలె సామాజిక, ఆర్థిక సర్వే కులగణన పూర్తి చేసింది. అందులో భాగంగా 83 వేల కుటుంబాలు అర్జీ పెట్టుకున్నాయి. వారి అర్హతలను పరిశీలించగా 90 శాతం మంది అర్హులని తేలినట్లు అధికారులు తెలుపుతున్నారు.
కొత్తగా దరఖాస్తులు : గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు పథకాల అమలు ప్రక్రియలో ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. పంచాయతీల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో పేర్కొన్న వారి నుంచి కుటుంబ సభ్యులు, ఆధార్, ఫోన్ నంబరు, కులం, చిరునామా వివరాలతో కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారు.
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవాలా? - ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి
కొత్త రేషన్‌కార్డుల జాబితాలో పేరు లేని వారికి గుడ్ న్యూస్ - పాత రేషన్ కార్డులపై కీలక నిర్ణయం