ETV Bharat / state

మేడారం వెళ్లడానికి వీలు కావడం లేదా? - ఇంట్లో నుంచే వనదేవతలకు బంగారం సమర్పించండిలా

Medaram Jatara Bangaram Online : మేడారం జాతర ఆన్​లైన్, ఆఫ్​లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మీసేవ, పోస్టాఫీసులతో పాటు 'టీ-యాప్ ఫోలియో' యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు.

Medaram Prasadam Online Booking Services
Minister Konda Surekha Launched Medaram Jatara Online Services
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 7:33 PM IST

Medaram Jatara Bangaram Online : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా ప్రసిద్ధిపొందిన మేడారం(Medaram Jatara) సమ్మక సారక్క జాతర త్వరలో ప్రారంభం కాబోతుంది. రెండు సంవత్సారాలకోసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవార్లకు ప్రీతిపాత్రంగా భావించే బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

Medaram Jatara Online Services : అయితే ఈసారీ మేడారం జాతరకు వెళ్లడానికి మీకు వీలు కుదరడం లేదా? అమ్మవారికి బాకీ ఉన్న మొక్కులు ఎలా చెల్లించాలని అలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. కేవలం మీరు 'మీసేవ' కేంద్రాల్లో బుక్ చేసుకుంటే చాలు నామామాత్రపు ఛార్జీతో దేవస్థానమే మీ మొక్కులు చెల్లిస్తుంది. ఈ సర్వీసును సచివాలయంలో ఈరోజు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ప్రారంభించారు. మీసేవ వెబ్​సైట్ ద్వారా తన మనవడు కొండా మురళీకృష్ణ పేరిట నిలువెత్తు బంగారం సమర్పణకు బుక్ చేశారు.

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

బరువును బట్టి కిలోకు 60 రూపాయలు చెల్లిస్తే నిలువెత్తు బెల్లం అమ్మవారి గద్దెల వద్ద మీ పేరిట దేవస్థానం వారు సమర్పిస్తారు. అమ్మవారి ప్రసాదం కోసం పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాలు, టీయాప్ ఫోలియో యాప్ ద్వారా డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదాన్ని మీకు పంపిస్తారు. టీయాప్‌తో పాటు రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీసేవ కేంద్రాలు, దేశంలోని సుమారు లక్షన్నర పోస్టాఫీసుల ద్వారా పోస్టల్ కేంద్రాలు ఈ సేవలను అందిస్తాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Medaram Prasadam Online Booking Services : ఏడాదంతా బంగారం సమర్పణ సేవలు కొనసాగుతాయని మంత్రి అన్నారు. తెలంగాణ సమాజం మహిమాన్విత శక్తులుగా కొలిచే సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని తెలిపారు. వివిధ కారణాలతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మరోవైపు మేడారంలో ఈరోజు గుడి మెలిగే పండుగ నిర్వహించారు. సిద్దబోయిన కుటుంబానికి చెందిన ఆడపడుచులు తల్లిగారి (వనదేవతల) ఇండ్లను శుద్ధిచేసి సమ్మక్క పూజారులు ఇంటి ఆడపడుచులతో మంగళ హారతులతో ఆలయానికి వెళ్లారు. అనంతరం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక రంగవల్లులతో ఆలయ పరిసరాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడవిలో దొరికే ఎట్ట గడ్డిని తీసుకువచ్చి గుడిపై కప్పారు. ఆచారంగా వస్తున్న సంప్రదాయాలను తు.చ. తప్పకుండా నిర్వహిస్తున్నామని పూజారులు అంటున్నారు.

నో ప్లాస్టిక్ జోన్​గా మేడారం జాతర - భారీ ఎత్తున అవగాహనకు ప్రణాళిక

మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.