ETV Bharat / state

ఇందిరమ్మ రాజ్యంపై కడియం శ్రీహరి విమర్శలు - తిప్పికొట్టిన కాంగ్రెస్ మంత్రులు

Kadiyam Srihari Speech in Assembly Sessions 2024 : ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్‌ కడియం శ్రీహరి అసెంబ్లీలో అన్నారు. దీనిపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇందిరమ్మ హయాంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించామని శ్రీధర్‌బాబు అన్నారు. బడ్జెట్‌పై మాట్లాడమని కడియం శ్రీహరికి అవకాశమిస్తే సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Kadiyam Srihari
Kadiyam Srihari
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 12:38 PM IST

Updated : Feb 14, 2024, 1:15 PM IST

ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదు

Kadiyam Srihari Speech in Assembly Sessions 2024 : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఆరోరోజు కొనసాగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అనుబంధ అంచనాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) చర్చను ప్రారంభించారు. దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని అన్నారు. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్సే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్‌ కూడా కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు.

Kadiyam Srihari Vs Ministers in Assembly : 'బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ రాష్ట్రం ఇచ్చిన యూపీఏ, సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ 'మలిదశ ఉద్యమ నాయకులు, కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరం. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం చేశారు. 2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం చేశారు. తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్సే. తెలంగాణకు కాంగ్రెస్‌ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని' కడియం శ్రీహరి తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని కడియం శ్రీహరి గుర్తు చేశారు. నియంతృత్వ, నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మరచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎమర్జెన్సీ చీకటి రోజులు మరచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆమె మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 404 స్థానాలు గెలుచుకుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.

రైతులకు ఎన్నికల్లో చెప్పింది చాంతాడంత - బడ్జెట్​లో ఇచ్చింది చెంచాడంత : హరీశ్​ రావు

Telangana Budget Sessions 2024 : కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు గౌరవంగా బతుకుతున్నారంటే అంది కాంగ్రెస్‌ వల్లేనని గుర్తు చేశారు. విపక్ష సభ్యులు ఇందిరమ్మ రాజ్యం అంశంపై ప్రత్యేకంగా చర్చిద్దామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. అనంతరం స్పందించిన కడియం శ్రీహరి బడ్జెట్‌ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైనే మాట్లాడుతున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఒకే కుటుంబం కోసం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.

Minister Ponnam Prabhakar Fires onKadiyam Srihari : కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. బడ్జెట్‌పై మాట్లాడమని కడియం శ్రీహరికి అవకాశమిస్తే సంబంధం లేని అంశాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ఎమర్జెన్సీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇందిరమ్మను ఇప్పటికీ దేవతగా గుర్తుచేసుకుంటారని చెప్పారు. నెహ్రూ, ఇందిరమ్మ లేకపోతే దేశం అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. ఆధునిక దేవాలయాల వంటి ప్రాజెక్టులు వచ్చేవా? అని పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రస్తావించారు.

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?

Telangana Budget Sessions 2024 : బడ్జెట్‌లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని కడియం శ్రీహరి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబుతునే ఆర్థిక వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉందని చెప్పారని అన్నారు. ఒక పేజీలో పుట గడవలేని, జీతాలివ్వాలేని పరిస్థితి అని రాశారని, మరో పేజీలో కేసీఆర్‌ పాలనలో తలసరి ఆదాయం పెరిగిందని, జీఎస్‌డీపీ పెరిగిందని చెప్పారని కడియం శ్రీహరి వివరించారు.

ఒక వైపు ఆర్థిక మాద్యం వస్తుంది, ఆదాయం పడిపోయింది వనరులు సరిగా లేవని చెప్పారు. మరో వైపు రూ.51,000ల కోట్ల బడ్జెట్‌ పెంచి చూపుతున్నారు. ట్యాక్స్‌ రెవెన్యూ రూ.20,000ల కోట్లు పెంచి చూపించారు. ట్యాక్స్‌ రెవెన్యూ ఎలా పెంచుతారో వివరించలేదు. రాష్ట్రం అప్పులపాలు అయ్యిందంటునే రూ.59,625 కోట్ల అప్పులు చేస్తామంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలు చేసిందని ఆరోపించారని, మరీ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి. - కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

శాసనసభలో కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం - కడియం, శ్రీధర్‌బాబు మధ్య డైలాగ్ వార్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి రెండేళ్లు పెంపు

Last Updated : Feb 14, 2024, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.