ETV Bharat / state

'నాన్నా - ఈ కాలేజీ నాకు నచ్చలేదు - నేను ఇంటికి వచ్చేస్తా' - Student Died of Electric Shock

Inter Student Died from Electric Shock : నాన్నా హాస్టల్​లో ఉండలేకపోతున్నా. ఇంటికి వచ్చేస్తా తీసుకెళ్లండని కుమారుడు తల్లిదండ్రులతో ప్రాధేయపడ్డాడు. సరే అలాగే వద్దువులే. మరో రెండు రోజులు చూడు. అప్పుడూ బాగోకపోతే వచ్చెయ్​ అని వారు చెప్పారు. కానీ వారి మాటలు వినకుండా ఆ విద్యార్థే గోడ దూకి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గోడ దూకుతూ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. కుమారుడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘటన హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Inter Student Died from Electric Shock
Inter Student Died from Electric Shock (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 12:10 PM IST

Student Died Due to Electric Shock at Hostel in Hyderabad : ఆ యువకుడు పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్​ చదువుల కోసమని చెప్పి కుమారుడిని తల్లిదండ్రులు కార్పొరేట్​ కళాశాలలో జాయిన్​ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే తాను అక్కడ ఉండలేనంటూ అమ్మానాన్నల వద్ద బోరుమన్నాడు. అయితే మరో రెండు రోజులు చూడాలని, అప్పటికీ కాలేజీ నచ్చకపోతే తామే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. అప్పటి వరకు ఆగని ఆ కుర్రాడు, ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని హాస్టల్​ ప్రహరీ గోడ దూకే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కర్రీ విజయ్​కుమార్​, చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్​ నగరానికి వచ్చి ఈస్ట్ ​మారేడుపల్లిలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు గిరీష్ ​కుమార్​ అరవంత్​ ఉన్నారు. కుమారుడికి పదో తరగతి పూర్తి కావడంతో ఈ నెల 12న హయత్​నగర్​ సమీపంలోని కోహెడ నారాయణ రెసిడెన్షియల్​ జూనియర్​ కళాశాలలో ఇంటర్​ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు.

ఈ నెల 16న ఆదివారం గిరీష్​ కుమార్​ తల్లిదండ్రులు, అక్క కలిసి హాస్టల్​కు వెళ్లారు. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని వారితో చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రులు మరో రెండు రోజులు చూడాలని, నచ్చకపోతే తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో హాస్టల్​లో ఉండడం ఇష్టం లేని గిరీష్​ కుమార్​, ఈ నెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.52 గంటల సమయంలో హాస్టల్​ భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దిగాడు. అక్కడ కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఉంది. దానిపై ఫెన్సింగ్​ ఉంది.

Inter Student Died from Electric Shock
గిరీష్​ కుమార్​ అరవంత్​ (ETV Bharat)

గోడ ఎక్కే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి​ షాక్​ : దాంతో కళాశాల ప్రాంగణంలోని గేటుకు ఎడమవైపున ట్రాన్స్​ఫార్మర్​ పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్​ తీగలు తగిలి, కరెంటు షాక్​కు గురయ్యాడు. అక్కడే కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో గిరీశ్​ కనిపించడం లేదంటూ బాలుని తల్లిదండ్రులకు జూన్​ 20వ తేదీన హాస్టల్​ సిబ్బంది ఫోన్​ చేసి చెప్పారు. దీంతో వారు కళాశాలకు చేరుకుని అన్ని చోట్లా ఆరా తీసినా ప్రయోజనం లేదు.

చివరికి బాలుడి తల్లి హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హాస్టల్​కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా, గిరీష్​ హాస్టల్​ నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అర్ధరాత్రి కళాశాల ప్రాంగణం ప్రహరీ వెంబడి గాలిస్తుండగా గిరీష్​ మృతదేహం చెట్ల పొదల్లో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారని ఆరోపించారు.

ఓయూ క్యాంపస్​లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం - ప్రేమ వైఫల్యమే కారణమా?

బాసర ట్రిపుల్ ఐటీలో మరో బలవన్మరణం - పీయూసీ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య - Student Suicide At Basara IIIT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.