ETV Bharat / state

మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field

Eenadu Group of Chairman Ramoji Rao Success in Media : ప్రపంచంలో ఎంతమంది మీడియా అధినేతలున్నా ఆయన ముద్ర ప్రత్యేకం! మీడియా ద్వారా ఒక జాతిని, భాషను ప్రభావితం చేసిన అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు. నిత్యం సత్యం నినదించే ఈనాడు, తెలుగువారి ఠీవీ ఈటీవీ, అరచేతికి సమాచారమిచ్చే ఈటీవీ భారత్‌! ఇలా ఒకటేంటి, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ ఆయన ఏ మాధ్యమంలో అడుగుపెట్టినా అదో సంచలనం. నిత్య నూతనం! అనేక ప్రయోగాలతో, మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు.

Eenadu Group of Chairman Ramoji Rao Success in Media

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 9:16 AM IST

Updated : Jun 8, 2024, 8:27 PM IST

మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు

Eenadu Group of Chairman Ramoji Rao Success in Media : మీడియా అంటే ఒక వ్యాపారం కాదు! సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం! రామోజీరావు దాన్నే నమ్మారు! 1969లో అన్నదాత మాస పత్రిక ద్వారా మీడియా రంగంలో తొలి అడుగువేశారు. రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు కర్షక లోకానికి అందించిన కరదీపికే అన్నదాత! దాని ద్వారా వ్యవసాయ వైజ్ఞానికకేంద్రాలు, కర్షకులకు మధ్య తిరుగులేని వారధి నిర్మించారాయన. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులు, కొత్త యంత్రాలపై ఎనలేని సమాచారం ఇచ్చారు. తెలుగు రైతుల్ని మూసవిధానాలు వదిలేసి ప్రయోగాల బాటపట్టించింది. కోట్లాది మంది రైతులకు వ్యవసాయ విజ్ఞాన ఫలాలు అందించింది.

మీడియా రంగంలో రామోజీ రావు విశేష సేవలు : 1974లో మీడియా రంగ ప్రస్థానంలో రామోజీరావు వేసిన మలి అడుగు సంచలనమైంది. అదే తెలుగునాట అత్యధిక సర్క్యులేషన్‌తో పాఠకాదరణ పొందిన ఈనాడు. విశాఖపట్నం కేంద్రంగా పురుడుపోసుకుంది ఈనాడు. తేనెలొలికే తెలుగు భాషకు అక్షర పాత్రైంది. నిత్యనూతన మార్పులకు.. అక్షయ పాత్ర అయింది. తెలుగు నేల తన చుట్టూ తాను తిరుగుతూ, ఈనాడు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. దానికి కారణం మార్పు ఒక్కటే శాశ్వతమని రామోజీరావు మనసారా నమ్మడం. ప్రజా సమస్యల పట్ల నిబద్ధత నిత్యం నిజానికి కట్టుబడే నిష్ఠలే ప్రాథమిక లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఈనాడు తెలుగు పాఠకుల దినచర్యలో భాగమైంది.

ఈనాడులో అచ్చు అయిందంటే అది శిలాక్షరమే అని అసంఖ్యాక తెలుగుపాఠకులు ఏనాడో తీర్మానించుకున్నారు. అందుకే 1976 ప్రథమార్థంలో 48,339 కాపీలుగా ఉన్న ఈనాడు సర్క్యులేషన్ అంచెలంచెలుగా పెంచుకుంటూ 2011 తొలి అర్ధానికి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరింది. కరోనా సమయంలో ఇక పత్రికల పని అయిపోయినట్లేనని చాలా మంది అనుమానించినా ఈనాడు వాటన్నింటినీ పటాపంచలు చేసింది. నేటికీ 23 కేంద్రాల్లో ముద్రితమవుతూ అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న తెలుగు దినపత్రికగా వెలుగొందుతోంది.

తెలుగువారి అభిమాన పత్రికగా ఈనాడు : నిత్యం ఉషోదయానికి ముందే సత్యం నినదించుగాక! ఈనాడునిర్వహణలో రామోజీరావు ఆచరించిన సిద్ధాంతమిదే. ఆ సిద్ధాంతం తెలుగు పత్రికల గతినే మార్చింది. ఈనాడు రాకముందు పత్రికలు ఏ మధ్యాహ్నానికో, సాయంత్రానికో గానీ పాఠకుడికి చేరేవి కావు. ఆ పరిస్థితిని మార్చేశారు రామోజీరావు! పత్రిక బట్వాడా వ్యవస్థ నుంచి ఏజెంట్ల నియామకం వరకూ అన్ని రంగాల్లోనూ కొత్త ఒరవడి సృష్టించారు. తెల్లవారక ముందే దినపత్రికను పాఠకుడి ఇంటికి చేర్చే అధ్యాయానికి రామోజీరావే నాందిపలికారు.

జాతీయ, అంతర్జాతీయ వార్తలు, నేతల ప్రకటనలు, బహిరంగసభల్లోప్రసంగాలతో నింపేసే మూసధోరణికి ముగింపు పలికింది ఈనాడు. తెలుగు జర్నలిజాన్ని పల్లె బాట పట్టించింది. అసలైన వార్తలు దేశ,రాష్ట్ర రాజధానుల నుంచి వెలువడేవి కావని, మారుమూల పల్లెల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలేపత్రికల ప్రాధాన్యం కావాలన్నది రామోజీరావు నమ్మకం. ఆ నమ్మకానికే ఈనాడు కట్టుబడింది. అందుకు అనుగుణంగానే స్థానిక ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం తొలిసంచిక నుంచే మొదలైంది. నాటి నుంచి నేటి వరకూ.. స్థానిక జన జీవనంతో ముడిపడిన వార్తలే ఈనాడుకు పంచప్రాణాలు.

తెలుగువారి ఆత్మగౌరవ పతాక ఈనాడు : ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మగౌరవపతాక! 1978-83 మధ్య నాటి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సయమంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ఈనాడు హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు.దానికి తగినట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు!

ప్రజాస్వామ్య పునరుద్ధరణకు : 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈనాడు అక్షర యుద్ధం చేసింది. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత YS రాజశేఖరరెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజి ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ హయాంలోజరిగినకుంభకోణాల్ని బహిర్గతం చేసింది. 2019లో జగన్‌ పాదయాత్రకూ,.. ఈనాడు కవరేజ్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్‌ అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలోప్రజాస్వామ్య పునరుద్ధరణలో తనవంతు పాత్రపోషించింది.

పాఠకుల అభిరుచికి తగ్గట్లుగా : పాఠకుల అభిరుచికి పట్టంకడుతూ నిత్యనూతనంగా ముందుకు సాగడమే ఈనాడు ప్రయాణం. ఆ క్రమంలో ఎడిషన్‌లో ఎన్నోమార్పులు జరిగాయి. అవి ప్రజలకు మరింత చేరువువుతూనే ఉన్నాయి. విశాఖలో తొలి ఎడిషన్ ప్రారంభమైన నాలుగేళ్లకేసర్క్యులేషన్‌లో అప్పటి అగ్రగామి పత్రిక ఆంధ్రప్రభను దాటేసింది ఈనాడు! ఇకఏనాడూ వెనుదిరిగి చూసిందిలేదు! అంతకంతకూ పాఠకాదరణ పెంచుకుంటూ సర్క్యులేషన్‌లో మరే తెలుగు దినపత్రికా అందుకోలేని సరికొత్త శిఖరాలను ముద్దాడింది. దీనికి కారణం రామోజీరావు చేసిన అనేక ప్రయోగాలే.

ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జిల్లా ఎడిషన్లు! స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా, అట్టడుగువర్గాల సమస్యలకు అద్దం పట్టేలా రామోజీరావు తెచ్చిన మినీ ఎడిషన్లు పెనువిప్లవాన్నే సృష్టించాయి. పత్రికా ప్రకటనల రంగంలోనూ ఈనాడు ట్రెండ్‌ ఫాలో కాకుండా కొత్తట్రెండ్‌ సృష్టించింది. ప్రకటనల కోసం ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడి ప్రజలకు లాభం చేకూర్చే, ఉపయోగపడే క్లాసిఫైడ్ ప్రకటనల సంస్కృతిని తెలుగులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈనాడే! ఆదివారం నాడు రోజువారీ వార్తలకు భిన్నమైన సమాచారం ఆస్వాదించేలా వైవిధ్యభరితమైన అనుబంధ పేజీ అందజేసింది. తదనంతరం ఒక పుస్తకరూపంలో ఆకర్షనీయంగా చిత్రవిచిత్ర మాలికల సమాహారంగా తీర్చిదిద్దింది.

మహిళా వివక్షత సమస్యలపై : అనాదిగా వివక్షకు గురవుతూ వచ్చిన మహిళల సమస్యలు, వారి విజయగాథలు సమాజానికి తెలియాలని, గుర్తించిన అభ్యుదయ సంపాదకుడు రామోజీరావు. 1992 సెప్టెంబరులో అలా మొదలైందే ఈనాడు వసుంధర పేజీ. మహిళలకోసం ఒక ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసిన తొలి దేశీయ పత్రిక ఈనాడే. అంతేకాదు తెలుగు పత్రికా రంగంలో తొలిసారిగా విద్యార్థుల కోసం ప్రతిభ పేజీని, వాణిజ్య వార్తలు కావాలనుకునే వారికోసం బిజినెస్ పేజీని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే రైతేరాజు పేజీని ప్రారంభించింది కూడా ఈనాడే.!పాఠకుల నాడి పసిగట్టడంలో ఈనాడు ఏనాడూ వెనుకబడలేదు. గతంలో వార, మాసపత్రికల్లో వచ్చే అంశాలను పాఠకులు రోజూ కోరుకుంటున్నారనే అభిప్రాయంతో వినూత్న అంశాలతో విభిన్న పేజీలు అందిస్తోంది. విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే చదువు పేజీ, ఆరోగ్యంపై అవగాహన పెంచే సుఖీభవ, క్రీడా సమాచారాన్ని అందించే ఛాంపియన్, శాస్త్ర సాంకేతిక పురోగతికి అద్దం పట్టే ఈ-నాడు పేజీ, మదుపరులకు మార్గనిర్దేశం చేసే సిరి, యువతరంలో జోష్‌ నింపే ఈతరం, పిల్లల కోసం హాయ్ బుజ్జీ, ఇలా అన్ని వర్గాలకూ ఆసక్తికరమైన వార్తల్ని, సమాచారాన్ని అందిస్తోంది ఈనాడు. పాఠకుడి గుండెలకు హత్తుకునే శైలిలో ప్రచురించే వార్తలేకాదు విలక్షణ రీతిలో రాజకీయ, సామాజిక అంశాలకు అద్ధంపట్టే ఈనాడు కార్టూన్లకూ కోట్ల మంది అభిమాన పాఠకులున్నారు.

ఈనాడు అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి. అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్నీ ముందుకు నడిపింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది ఎవరో వస్తారు? ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునేలా 1995లో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. చెరువుల్లో పూడిక తీత,. రోడ్ల మరమ్మతులు, కాలువల మరమ్మతులకు గ్రామస్థులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తినింపింది. తుపానుల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం. తుపాన్ల సమయంలో సంస్థ రిలీఫ్‌ ఫండ్ ప్రకటించడడం పాఠకులూ బాధితులకు ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించడం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం.. ఈనాడు మార్క్‌ మానవత్వం. అందుకే ఈనాడు అంటే నాటికి, నేటికీ, ఏనాటికైనా తెలుగు ప్రజల నాడి.

సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంకట్టే ఈనాడుకు అనుబంధంగా సితార సినిమా వారపత్రికను ప్రారంభించారు రామోజీరావు. చిత్రపురి విశేషాల సమాహారంగా 1976 అక్టోబరు 3న సితారను సినీ అభిమానులకు అందించారు. కేవలం వార్తలు, కథనాలు అందించేందుకే పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగా సితారను తీర్చిదిద్దారు రామోజీరావు! 1980 నుంచి మూడేళ్లపాటు సితార ఆవార్డుల కార్యక్రమం నిర్వహించి ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణుల్ని సన్మానించారు. 1978లో సాహితీ ప్రేమికుల దాహం తీర్చేలా చతుర, విపుల మాసపత్రికలు ప్రారంభించారు. నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా తెచ్చిన విపుల సాహిత్యరంగంలో వినూత్న ప్రయోగం. ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికల్ని 4 దశాబ్దాలపాటు నిరాటంకంగానడిపారు రామోజీరావు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే ఈనాడు తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే అంతర్జాలంలో అడుగుపెట్టింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈనాడు వార్తలు అందించాలనే ఆశయంతో 1999లో ఈనాడు డాట్‌ నెట్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. దాని ద్వారా తాజా వార్తలు వేగంగా ఎప్పటికప్పుడు అందిసున్నారు.ఆంగ్ల దినపత్రికనూ రామోజీరావు రెండు దశాబ్దాలపాటు విజయవంతంగా నడిపించారు. 1984 జనవరి 26న న్యూస్‌టైమ్‌ ప్రారంభించారు. 20 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో వందల మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించారు.

తెలుగు పత్రికారంగాన్ని కొత్తపుంతలు తొక్కించడమేకాదు వాడుక బాషకు పట్టం కట్టారు రామోజీరావు. ఈనాడు వార్తాపత్రికలోఆంగ్లపదాలకు చోటు లేకుండా వాటికి ప్రత్యామ్నాయ తెలుగు పదాలు సృష్టించారు. చాలా కొత్త పదాలను ఈటీవీ ఈనాడు ప్రాచుర్యంలోకి తెచ్యాయి. తెలుగుబాషా సేవలో రామోజీరావు మరో ముందడుగే తెలుగువెలుగు మాస పత్రిక! తేనెలొలికే తియ్యని పద, సాహిత్య మాధుర్యాన్ని నలుగురికీ పంచందుకు తెలుగు వెలుగు పత్రిక రూపొందించారు. ఇతక చిన్నారుల్లోనూ బాషాను రక్తిని కల్పించి,, సృజనాత్మక పెంపొందించేలా బాలభారతం పత్రికనూ నడిపించారు.

ప్రింట్‌ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే లక్ట్రానిక్‌ మీడియాలో రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ తెలుగువారి ఠీవీగా భావిల్లుతోంది. దృశ్యమాధ్యమంలో అప్పటివరకూ ఉన్న మూసధోరణిని మార్చేసి బుల్లితెరపై అవధుల్లేని వినోదం పంచుతూ ఇంటింటి టీవీ అయింది ETV. 1995 ఆగస్టు 27న తెలుగులో మొట్టమొదటి 24గంటల ఛానల్‌గా ప్రారంభమైంది! పేరుకు వినోద ప్రధానమైనా ఇంటిల్లిపాదినీ అలరించేలా వినూత్న కార్యక్రమాలు ప్రసారం చేసింది. వారానికి ఒక సీరియల్‌ను ఆస్వాదించే ప్రక్షకులను డైలీ సీరియల్స్‌తో టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.

మూడు పాటలు, ఆరు సినిమా కార్యక్రమాలు అంటూ.. గిరిగీసిన సినీ వినోద వలయంలో ఈటీవీ చిక్కుకోలేదు. వేకువనే 'అన్నదాత'కు పంట సిరులు కురిపించే మెలకువలు నేర్పిస్తుంది. గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంతో రామోజీరావు పట్టుపట్టి చేయించిన కార్యక్రమం పాడుతా తీయగా! ఈ కార్యక్రమం సినీ పరిశ్రమకు వందల మంది గాయనీగాయకుల్ని అందించింది! నేటికీ అందిస్తూనే ఉంది. స్టార్‌ మహిళ వంటి కార్యక్రమం గిన్నీస్‌ పుస్తకంలోకి ఎక్కింది. జబర్దస్త్‌ కామెడీషో ప్రేక్షకుల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది! ఢీ రియాల్టీ డ్యాన్స్‌ షో ప్రేక్షకులతో స్టెప్పులు వేయిస్తోంది. ఇలా చెప్పుకుంటూపోతే వినోదాల జల్లులో జనం తడిసిముద్దయ్యేలా ETV కార్యక్రమాలను ప్రజలకు అందించారు రామోజీరావు.

మానవ సంబంధాలకు విలువిస్తూ, మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందిస్తూ ETV నెట్‌వర్క్‌ను వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. 2000 సంవత్సరం ఏప్రిల్లో ఈటీవీ బంగ్లా ప్రారంభమైంది. మూడు నెలల్లోనే మరాఠీ ఛానల్ మొగ్గ తొడిగింది. సరిగ్గా మరో ఐదు నెలలకే ఈటీవీ కన్నడ కస్తూరిలా పరిమళించింది. 2001 ఆగస్టు నుంచి ఈటీవీ ఉర్దూ ప్రసారాలు మొదలయ్యాయి. 2002 జనవరిలో ఒకేరోజు ఆరు ఛానళ్లను ఆరంభించి మీడియా చరిత్రలో మరో సంచలనం సృష్టించారు రామోజీరావు. ప్రాంతీయ భాషాఛానళ్లతో ప్రజలకు చేరువైన ఈటీవీ ఒక పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది.

తెలుగునాట వినోదం పంచుతున్న ఈటీవీని ఓ సమాచార విప్లంగా మార్చాలని రామోజీరావు సంకల్పించారు. తెలుగు నేల నలుచెరగులా సమాచార వెలుగులు ప్రసరింపజేయడమే లక్ష్యంగా 2003 డిసెంబరులో ఈటీవీ-2 న్యూస్‌ ఛానల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ పేరిట రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా 24 గంటల వార్తాస్రవంతిని ప్రారభించారు. ఎప్పటికప్పుడు తాజావార్తలతోపాటు విశ్లేషణలు, నిజ జీవన గాథలతో అలరిస్తోంది. ఈటీవీ అంటే సంచలనాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా విశ్వసనీయతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. ఈటీవీ తెరపై కనిపిస్తేనే నమ్ముతారనేంత విశ్వాసాన్ని పొందింది.

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈటీవీ నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్పిరిచ్యువల్‌ ఛానల్స్‌ ప్రేక్షకులను రకరకాల కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇక భవిష్యత్‌ను ముందే పసిగట్టే రామోజీరావు తెలుగునాట అతిపెద్ద డిజిటల్‌ మీడియా విభాగాన్ని సృష్టించారు. అదే ఈటీవీ భారత్‌. 13 భాషల్లో వార్తలు అందిస్తూ అతిపెద్ద డిజిటల్‌ ప్లాట్‌ఫాంగా ఈటీవీ భారత్‌ అరచేతిలో సమాచారం అందించే అస్త్రంగా మారింది.

పెద్దలకే కాదు పిల్లలకూ వినోదాన్ని అందించాలన్నది రామోజీరావు ఆలోచన. అందులో నుంచి పుట్టిందే ఈటీవీ బాల భారత్‌. 4 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్ని కట్టిపడేసేలా 12 భాషల్లో కార్టూన్‌ కార్యక్రమాలను అందిస్తున్నారు.

భవిష్యత్‌ వినోదాన్ని శాసించే ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీవీ అడుగుపెట్టింది. ఈటీవీ నెట్‌వర్క్‌లోని కార్యక్రమాలన్నింటితోపాటు ఉత్కంఠరేపే వెబ్‌సిరీస్‌లు, అలనాటి చిత్రరాజాలన్నీ ఈటీవీ విన్‌ ఓటీటీ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచారు.ఇవన్నీ కలిపి కోట్ల మంది ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే ఈటీవీ నెట్‌వర్క్‌గా ప్రేక్షకుల అందించారు.

Last Updated : Jun 8, 2024, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.