ETV Bharat / sports

కోచ్​గా 2007 టీమ్​ కెప్టెన్​ - ఈ టోర్నీతో ఆ ఇద్దరి కల తీరేనా? - T20 World Cup 2024

Rahul Dravid T20 World Cup 2024 : వెస్టిండీస్‌. ఈ పేరు చెప్పగానే 2007 వన్డే ప్రపంచకప్‌ అభిమానుల కళ్ల ముందు నిలుస్తుంది. భారత్‌ దారుణ పరాభవమే దానికి కారణం. కానీ అదే ఏడాదిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాడు. గాయాన్ని మాన్పి అభిమానులను ఉర్రూతలూగించాడు. అయితే ఈ సారి ఆ జట్టు నుంచి ఓ ప్లేయర్ కోచ్​గా మారి ప్రస్తుత టీమ్​ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ విశేషాలు మీ కోసం

Rahul Dravid T20 World Cup 2024
Rahul Dravid T20 World Cup 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 11:12 AM IST

Rahul Dravid T20 World Cup 2024 : మళ్లీ వెస్టిండీస్‌ వేదికగా ప్రపంచకప్‌ వచ్చింది. కాకపోతే ఈ సారి విండీస్‌ సహ ఆతిథ్య జట్టు. కానీ భారత్‌ పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ సారీ వన్డే ప్రపంచకప్‌లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007 ఏడాది లాగా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంతగడ్డపై వరుస విజయాలతో ఫైనల్‌కు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని బాధను మిగిల్చింది.

అయితే ప్రస్తుత అభిమానులు కూడా 2007 వన్డే ప్రపంచకప్‌ నాటి మానసిక స్థితిలోనే ఉన్నారు. ఈ బాధను ఇంకా మరిచిపోకమందే టీ20 ప్రపంచకప్‌ వచ్చింది. మరి ఈ సారి 2007లో ఆడిన స్టార్లలో మిగిలిన ప్లేయరే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు! 2007 వన్డే ప్రపంచకప్‌ సారథి అయిన రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకుంటారా? ఆ జట్టు నుంచి అతడొక్కడే

2007 టీ20 ప్రపంచకప్​ను కైవసం చేసుకున్న భారత జట్టులో రోహిత్‌ శర్మ కీలక సభ్యుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ఇండియా తరఫున ఉండి ప్రస్తుత జట్టులోనూ ఆడుతున్న ఏకైక ప్లేయర్ అతడు. ఓ ప్లేయర్​గా అపార అనుభవం ఉన్న ఈ స్టార్ ప్లేయర్​పై ఇప్పుడు కెప్టెన్‌గా జట్టుకు కప్‌ అందించాల్సిన పెద్ద బాధ్యత ఉంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఫైనల్‌కు చేర్చినప్పటికీ ఆఖరి పోరులో ఓటమిని చవిచూడక తప్పలేదు.

ఇక కెరీర్‌లో బహుశా చివరి ప్రపంచకప్‌ ఆడనున్న రోహిత్​కు ఈ టీ20 కప్‌తో అభిమానులను మురిపించడానికి ఇంతకుమించిన అవకాశం దొరకదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ 2007 ప్రపంచకప్‌లో గెలిచిన తర్వాత జరిగిన తర్వాత టీమ్‌ఇండియాకు టీ20 ప్రపంచకప్‌ మళ్లీ చిక్కలేదు. పైగా ఈ టోర్నీలో మిగతా జట్ల నుంచి కూడా పోటీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సారి కప్‌ సాధించడం, అది కూడా విదేశీ గడ్డపై దాన్ని అందుకోవడం పెద్ద సవాల్‌.

బ్యాటింగ్‌, బౌలింగ్ ఇలా రెండింటిలోనూ టీమ్‌ఇండియా బలంగా ఉంది. అంతే కాకుండా ఈ సారి కప్​ ఎలాగైన గెలవాలన్న కసితో ప్లేయర్లు ఉండటం ప్లస్ పాయింట్. ఈ నేపథ్యంలో సహచరులను సమన్వయపరుచుకొంటూ, వనరులను వాడుకుంటూ రోహిత్‌ ఎలా ముందుకెళ్తాడో అనేది ఆసక్తికరం.

ఆ మాజీ కెప్టెన్ ఆశ నెరవేరేనా?
కెప్టెన్‌ రోహిత్‌ శర్మది ఓ కథ అయితే, టీమ్ఇండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్​ది మరో స్టోరీ. 2007 వన్డే ప్రపంచకప్‌లో దారుణ పరాభవం వల్ల సారథ్యం కోల్పోయాడు ఈ మాజీ స్టార్ క్రికెటర్. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు. దీంతో సుదీర్ఘ కాలం భారత్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటికీ ప్రపంచకప్​ను ముద్దాడాలన్న అతడి కల అలాగే మిగిలిపోయింది.

ఓ క్రికెటర్​గా జయించలేనిది ఇప్పుడు కోచ్​గా సాధించేందుకు సిద్ధమయ్యాడు రాహుల్‌. ఇప్పుడు ఆయన ముందర ఉండేది ఓకే ఒక్క సవాలు. తన జట్టును కప్‌ దిశగా నడిపించి, వన్డే కప్‌ లోటును టీ20 కప్‌ ద్వారా అయినా తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి. పైగా కోచ్‌గా రాహుల్‌కు ఇదే చివరి కప్‌ కూడా. ఈ కప్‌ను గెలిపిస్తే ఓ మంచి కోచ్​గా రాహుల్‌ చరిత్రలో నిలుస్తాడు.

ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరిగే వెస్టిండీస్‌లో పిచ్‌లు భారత్‌ పిచ్‌ల మాదిరే కాస్త మందకోడిగా ఉంటాయి. ఇలాంటి ట్రాక్‌లపై మహా మహా జట్లను సైతం ఎదుర్కొని టీమ్‌ఇండియా కప్‌ అందుకోవాలంటే ద్రవిడ్‌ అపార అనుభవం వారికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అటు రోహిత్, ఇటు రాహుల్‌లు తమ కల నెరవేర్చుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

భారత్ x ఐర్లాండ్ - చిన్న జట్టే అయినా తగ్గేదేలే! - T20 World Cup 2024

టీ20లో అరుదైన ఘనత - తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న సౌతాఫ్రికా బౌలర్ - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.