ETV Bharat / sports

టీ20ల్లో అత్యధిక ఛేజింగ్​లు ఇవే - టాప్​లో ఎవరున్నారంటే? - HIGHEST RUN CHASES - HIGHEST RUN CHASES

Highest Run Chases In T20 Cricket : టీ20 హిస్టరీలో పంజాబ్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. కేకేఆర్‌పై 262 పరుగులతో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో అంతకు ముందు భారీ స్కోర్‌లు ఛేజ్‌ చేసిన మ్యాచ్‌లు ఏవో తెలుసుకుందాం.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 4:46 PM IST

Highest Run Chases In T20 Cricket : ఐపీఎల్​ 2024లో రికార్డుల వర్షం కురుస్తోంది. గతంలో గొప్పగా భావించే 200+ స్కోరు ఇప్పుడు కామన్‌ అయిపోయింది. ఐపీఎల్‌ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు ఈ సీజన్‌లో రెండు సార్లు బద్ధలైంది. ఏప్రిల్‌ 26న శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డు కూడా క్రియేట్‌ అయింది. కేకేఆర్‌ నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్‌ని పంజాబ్‌ కింగ్స్‌ అలవోకగా ఛేదింసేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీ20 క్రికెట్‌ హిస్టరీలో టాప్‌ 5 రన్‌ ఛేజింగ్‌ మ్యాచ్‌లు ఏవో తెలుసుకుందాం.

  • 243 - 2023 పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్ జల్మీపై ముల్తాన్ సుల్తాన్స్ భారీ విజయం అందుకుంది. సయీమ్ అయూబ్ 33 బంతుల్లో 58, బాబర్ అజామ్ 39 బంతుల్లో 73 పరుగులు చేయడంతో పెషావర్ 20 ఓవర్లలో 242/6 స్కోరు సాధించింది. అనంతరం రిలీ రొసోవ్ 51 బంతుల్లో 121 రన్స్‌తో చెలరేగడంతో, కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 52 పరుగులు చేయడంతో 5 బంతులు ఉండగానే ముల్తాన్‌ సుల్తాన్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది.
  • 244 - 2018లో మరో ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. NZ vs AUS మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 243 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 54 బంతుల్లో 105 పరుగులు, కొలిన్ మున్రో 33 బంతుల్లో 76 పరుగులు చేయడంతో ఈ భారీ స్కోరు సాధించింది. అనంతరం ఆసీస్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 59, షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేయడంతో, చివరిలో గ్లెన్ మాక్స్‌వెల్ 14 బంతుల్లో 31*, మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో 36 మెరుపులతో ఆసీస్‌ను 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
  • 253 - 2023లో టీ20 బ్లాస్ట్‌లో సర్రే వర్సెస్‌ మిడిల్‌సెక్స్‌ మధ్య ఈ హైయెస్ట్‌ రన్‌ ఛేజ్‌ నమోదైంది. విల్ జాక్స్ 45 బంతుల్లో 96, లారీ ఎవాన్స్ 37 బంతుల్లో 85 పరుగులు చేయడంతో సర్రే 20 ఓవర్లలో 252/7 స్కోరు సాధించింది. మిడిల్‌సెక్స్ కెప్టెన్‌ స్టీఫెన్ ఎస్కినాజీ 39 బంతుల్లో 73, మాక్స్ హోల్డెన్ 35 బంతుల్లో 68*, ర్యాన్ హిగ్గిన్స్ 28 బంతుల్లో 48 బాదడంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపు అందుకుంది.
  • 259 - 2023 ఇంటర్నేషనల్‌ టీ20లో వెస్టిండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించింది. ఇది ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో హైయస్ట్‌ రన్‌ ఛేజ్‌గా మిగిలిపోయింది. జాన్సన్ చార్లెస్ 46 బంతుల్లో 118, కైల్ మేయర్స్ 27 బంతుల్లో 51 పరుగులు చేయడంతో విండీస్‌ 258/5 భారీ స్కోరు చేసింది. అనంతరం క్వింటన్ డికాక్ 44 బంతుల్లో సెంచరీ, రీజా హెండ్రిక్స్ 28 బంతుల్లో 68 పరుగులు, ఐడెన్ మార్‌క్రమ్‌ 21 బంతుల్లో 38 పరుగులు చేయడంతో 7 బంతులు మిగిలి ఉండగానే SA టార్గెట్‌ రీచ్‌ అయింది.
  • 262 - ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ సెట్‌ చేసిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించింది. సాల్ట్ 37 బంతుల్లో 75, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో KKR 20 ఓవర్లలో 261/6 స్కోర్ చేసింది. కొండంత లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగన పంజాబ్‌కు ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ శుభారంభం ఇచ్చాడు. 20 బంతుల్లోనే 54 రన్స్‌ కొట్టాడు. మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో 48 బంతుల్లో అద్భుత సెంచరీ 108* సాధించాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లో 68 పరుగులతో వీరవిహారం చేయడంతో 8 బంతులు మిగిలి ఉండగానే PBKS లక్ష్యాన్ని అందుకుంది.

పంజాబ్ రికార్డ్​ ఛేజింగ్​ - ఉత్కంఠ పోరులో కోల్​కతాపై విజయం - IPL 2024 PBKS VS KKR

జూలు విదిల్చిన పంజాబ్- టీ20 హిస్టరీలోనే భారీ ఛేజింగ్- మ్యాచ్​లో రికార్డులివే! - 2024 IPL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.