Ind vs Pak Tickets: 2024 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియాలకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావట్లేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనమిచ్చాయి. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు. అయితే టోర్నీలో మొత్తంలో హై వోల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ పోరుకు మాత్రం భారీ సంఖ్యలో ఆడియెన్స్ హాజరవుతారని ఐసీసీ ఆశిస్తోంది. జూన్ 9న న్యూయార్క్ నసావు క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌తో టోర్నీకి భారీగానే ఆదాయం వస్తుందని ఐసీసీ భావించింది.
కానీ, ఈ మ్యాచ్‌కు కూడా అంతంత మాత్రానే ప్రేక్షకులు స్టేడియానికి రానున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా రెండు మాత్రమే ఉన్నప్పటికీ టికెట్లు పూర్తిగా అమ్ముడు కాలేదు. ఐసీసీ వెబ్సైట్లో ఇంకా చాలా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తోంది. ప్రీమియమ్ క్లబ్ లాంజ్ (Premium Club Lounge), డైమండ్ క్లబ్ లాంజ్ (Diamond Club Lounge)ల్లో వందలాది టికెట్లు అన్‌సోల్డ్ (Unsold)గానే ఉన్నాయి. కాగా, ఏ టోర్నీలోనైనా ఇండోపాక్ క్రికెట్ మ్యాచ్‌కు టికెట్లు ఇంత నెమ్మదిగా అమ్ముడవడం ఇదే తొలిసారి అని నెటిజన్లు అంటున్నారు. కాగా, కేవలం 300 డాలర్ల టికెట్లు (Standard Ticket) పూర్తిగా అమ్ముడయ్యాయి.
దాదాపు డబుల్: అయితే సాధారణం కంటే టికెట్లు రేట్లు విపరీతంగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే టోర్నీలో న్యూయార్క్ స్టేడియంలో జరిగిన భారత్- ఐర్లాండ్ మ్యాచ్‌కు ప్రీమియమ్ టికెట్ (పిచ్‌కు ఎదురుగా) 1000 డాలర్లు ఉండగా, అదే టికెట్ ఇండోపాక్ మ్యాచ్‌కు 2500 డాలర్లకు (రూ. 2.10 లక్షలు) పెంచారు. అంటే 150శాతం పెంచారు. ఇక డైమండ్ ప్రీమియమ్ సీట్ అత్యధికంగా 10,000 డాలర్లు (రూ. 8.30 లక్షలు)గా నిర్ణయించారు.
ఫైనల్ కంటే ఎక్కువ రేటు: దీనిపై క్రికెట్ అనలిస్ట్‌లు కూడా స్పందిస్తున్నారు. 'అమెరికన్లకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలీదు. అందుకనే తెలియని గేమ్ కోసం అంత ఎక్కువ ధర టికెట్లు కొనుగోలు చేసి స్టేడియానికి వెళ్లాలనుకోరు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అమెరికాలో అత్యంత ఆదరణ కలిగిన బాస్కెట్‌బాల్, ఎన్బీఏ (NBA) టోర్నమెంట్ మ్యాచ్‌లకు కూడా ఇంత ఎక్కువగా టికెట్లు లేవు అని, రీసెంట్గా జరిగిన NBA ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర కూడా అంతకంటే తక్కువ (546 డాలర్లు) ఉందని అన్నాడు.
డేంజరస్‌గా మారుతున్న అమెరికన్ టీమ్ - మనోళ్లు జాగ్రత్తగా ఆడాల్సిందే! - T20 WorldCup 2024