ETV Bharat / sports

న్యూజిలాండ్​తో పోరు - తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి - Womens T20 World Cup 2024

India Women vs New Zealand : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్​.

source Associated Press
India Women vs New Zealand (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 4, 2024, 10:58 PM IST

WOMENS T20 WORLD CUP 2024 India Women vs New Zealand : టీ20 ప్రపంచ కప్‌ ఫేవరెట్లలో ఎప్పుడూ ఒకటిగా ఉంటుంది భారత జట్టు. అలానే ఈ సారి కూడా అమ్మాయిల టీ20 వరల్డ్ కప్​లో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని మాత్రం పేలవంగా ప్రారంభించింది. తన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 58 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌ చేతిలో చిత్తైపోయింది.

కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 57; 7×4)తో పాటు ఓపెనర్‌ జార్జియా ప్లిమర్‌ (23 బంతుల్లో 34; 3×4, 1×6) రాణించడం వల్ల న్యూజిలాండ్​ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత జట్టు బౌలర్లలో రేణుక సింగ్‌ (2/27), ఆశ శోభన (1/22), అరుంధతి రెడ్డి (1/28) వికెట్లు తీశారు.

ఇక ఛేదనలో మన అమ్మాయిలు తేలిపోయారు. రోజ్‌మేరీ మైర్‌ (4/19), లియా తహుహు (3/15), ఈడెన్‌ కార్సన్‌ (2/34)ల దెబ్బకు టీమ్ ఇండియా కుప్పకూలిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 102 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. మన అమ్మాయిలలో హర్మన్‌ ప్రీత్​ 15 పరుగులతో టాప్‌ స్కోరర్​గా నిలిచింది.

మనోళ్లు ఎలా ఆడారంటే? - బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న భారత్‌ 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలు తప్పాయి. భారత బ్యాటర్లు తేలిపోయారు. ఒక్కరూ క్రీజులో ఉండలేకపోయారు. పేలవ షాట్లు ఆడి చేతులెత్తేశారు.

ఈ పోరులో భారత్‌ను స్పిన్నర్‌ ఈడెన్‌ కార్సన్‌ తొలి దెబ్బ కొట్టింది. ఆమె బంతిని తప్పుగా అంచనా వేసిన షెఫాలి (2) తనకే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయింది. ఆ వెంటనే స్మృతి (12) కూడా ఈడెన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది. కెప్టెన్‌ హర్మన్‌ కాసేపు నిలకడగానే ఆడినట్టు కనిపించినా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. హర్మన్‌ సమీక్ష కోరినా ఫలితం దక్కలేదు.

అనంతరం భారత్‌ను మిగతా బ్యాటర్లు కూడా ఆదుకోలేకపోయారు. అందరూ షాట్స్​కు ప్రయత్నించి విఫలమయ్యారు. జెమీమా (13), రిచా (12), దీప్తి (13) అందరూ చేతులెత్తేశారు. దీంతో మరో ఓవర్‌ మిగిలుండగానే భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. కాగా, టీమ్​ ఇండియా అమ్మాయిలు తమ తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్నారు.

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది - అమ్మాయిల సెమీస్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - T20 WORLD CUP 2024 Semifinal

15 పరుగులు, సున్నా వికెట్లు - అయినా ఆ మ్యాచ్​ హీరోగా నిలిచిన సచిన్‌! - Sachin Tendulkar Match Winning Hero

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.