ETV Bharat / sports

దిల్లీ ఘన విజయం- వరుసగా రెండోసారి ఫైనల్​కు - DC vs GG WPL 2024 Dc Won

DC vs GG WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​లో లీగ్ దశ ఆఖరి మ్యాచ్​లో దిల్లీ- గుజరాత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి, నేరుగా ఫైనల్​కు దూసుకెళ్లింది.

DC vs GG WPL 2024
DC vs GG WPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 10:12 PM IST

DC vs GG WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్​లో దిల్లీ ఘన విజయం సాధించింది. బుధవారం గుజరాత్ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన దిల్లీ నేరుగా ఫైనల్స్​కు దూసుకెళ్లింది. గుజరాత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ ఓవర్లలో ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో షఫాలీ వర్మ (71 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, జెమిమా రోడ్రిగ్స్ (38* పరుగులు) రాణించింది. గుజరాత్ బౌలర్లలో తనుజా రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక ఈ విజయంతో దిల్లీ మహిళల ప్రీమియర్​ లీగ్​లో వరుసగా రెండోసారి ఫైనల్స్​కు అర్హత సాధించింది.

స్వల్ప లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగానే ఆరంభించింది. అయితే మూడో ఓవర్లో గుజరాత్ రెండు వికెట్లు తీసి గేమ్​లోకి వచ్చినట్లు కనిపించింది. ఓపెనర్ మెగ్ లానింగ్ రనౌట్​ కాగా, అదే ఓవర్ ఐదో బంతికి అలీస్ కాప్సీ (0) పెవిలియన్ బాట పట్టింది. అయినప్పటికీ యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ ఏ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆమెకు తోడుగా జెమిమా రోడ్రిగ్స్​ కూడా విలువైన ఇన్నింగ్స్​ ఆడుతూ గుజరాత్​కు మరో ఛాన్స్ ఇవ్వలేదు. మూడో వికెట్​కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ దిల్లీని విజయంలో కీలక పాత్ర పోషించారు

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్​వ్రాట్ (7 పరుగులు), బెత్ ముూనీ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. వన్​డౌన్​లో వచ్చిన హేమలత (4 పరుగులు) కూడా ప్రభావం చూపలేకపోయింది. ఫోబి లిచ్​ఫీల్డ్ (21 పరుగులు), గార్డ్​నర్ (12) విలఫమయ్యారు. భారతి ఫుల్​మలి (42 పరుగులు), ఆఖర్లో బ్రేస్ (22* పరుగులు) రాణించడం వల్ల గుజరాత్​కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది. దిల్లీ బౌలర్లలో మారిజన్ కాప్, శిఖా పాండే, మిన్ను మని తలో రెండు వికెట్లు దక్కించుకోగా, జొనసేన్ ఒక వికెట్ పడగొటట్టింది.

WPL 2024 ముంబయిపై విజయం - పెర్రీ సంచలన ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు ఆర్సీబీ

WPL 2024 : చావోరేవో మ్యాచ్​లో యూపీ ఓటమి- ప్లేఆఫ్​ ఆశలు గల్లంతే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.