Chess Olympiad Golden Medallist : హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ కోసం 190కి పైగా దేశాలు పోటీ బరిలోకి దిగాయి. దేశ విదేశాల తరపున ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కూడా విజేతలుగా నిలిచాయి. గోల్డ్ మెడల్‌ను సాధించాయి.
అయితే తాజాగా ఈ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న ప్రజ్ఞానంద, వైశాలి, ఒలింపియాడ్ టీమ్ కెప్టెన్ శ్రీనాథ్ ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. వీరికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం, స్పోర్ట్స్ మినిస్టర్స్ కూడా వారికి అభినందనులు తెలిపారు.
చెన్నై విమానాశ్రయంలో ఈ ముగ్గురు దిగగానే తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తమిళనాడు వారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజ్ఞానంద, వైశాలి, కెప్టెన్ శ్రీనాథ్ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించడంపై తమ అనుభవాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు.
"45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించడం చాలా గర్వంగా ఉంది. చాలా పాయింట్లతో గెలిచాం. ఇప్పటికే రష్యాతో కలిసి గోల్డ్ మెడల్ సాధించాం. కానీ ఇప్పుడు సింగిల్‌గానే గోల్డ్ మెడల్ సాధించాం. ఇక ఇప్పుడు భారతదేశం అత్యుత్తమ జట్టు అని చూపించడం కన్నా ఎక్కువ. మేము పాయింట్లతో గెలిచాము". అని ఒలింపియాడ్ టీమ్ కెప్టెన్ శ్రీనాథ్ పేర్కొన్నారు.
వైశాలి మాట్లాడుతూ - "చాలా ఆనందంగా ఉంది. గతసారి చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం సాధించాం. అప్పుడు గోల్డ్ మెడల్ గెలవకపోవడం చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. భారత పురుషుల జట్టు అత్యధిక పాయింట్ల తేడాతో గెలిచింది. కానీ మహిళల జట్టు ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రం గెలిచింది, పతకాన్ని గెలుచుకుంది" అని చెప్పింది.
ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతూ - "చెన్నైలో జరిగిన గత చెస్ ఒలింపియాడ్‌లో మేము విజయానికి చాలా చేరువగా వచ్చి వచ్చి బంగారు పతకాన్ని కోల్పోయాము. ఈసారి ఎక్కువ పాయింట్లతో గెలవడం చాలా బాగుంది. ఆడిన అన్ని మ్యాచ్‌లు కఠినంగా ఉన్నాయి. అగ్రశ్రేణి USA జట్టును ఓడించిన తర్వాత, మన దేశానికి బంగారు పతకం ఖాయమైంది" అని ఆయన ముగించారు.
కాగా, గతంలో 2014, 2022లో రెండు బ్రాంజ్ మెడల్స్‌ను అందుకుంది భారత్. కరోనా సమయంలో ఆన్లైన్ వేదికగా నిర్వహించిన టోర్నీలో గోల్డ్ మెడల్‌ను రష్యాతో కలిసి పంచుకుంది. అనంతరం ఇప్పుడు గత 90ఏళ్ల చరిత్రలో ఒలిసారి సింగిల్‌గా స్వర్ణ పతకాన్ని సాథించింది.
ధోనీ కెప్టెన్సీకి అసలైన నిర్వచనం ఈ అద్భుత విజయం - 2007 T20 world cup
చరిత్ర సృష్టించిన భారత్ - ఒలింపియాడ్‌లో డబుల్ స్వర్ణాలు! - Chess Olympiad 2024