Ind vs Aus Test 2024 : గబ్బా టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 89-7 స్కోర్ వద్ద డిక్లెర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ 185 పరుగులు కలుపుకొని భారత్‌కు 275 రన్స్ టార్గెట్ నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో టపటపా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పాట్ కమిన్స్ (22 పరుగులు) టాప్ స్కోరర్. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
వర్షం వల్ల తొలి సెషన్‌లో దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆడేయడం ప్రారంభించింది. టీమ్ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చారు. కానీ, భారత బౌలర్ల దెబ్బకు వారి ప్రణాళికలు పటాపంచలు అయ్యాయి. మూడో ఓవర్లోనే బుమ్రా ఖవాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 6.1 వద్ద లబుషేన్‌ను కూడా బుమ్రా ఔట్ చేశాడు.
ఈ క్రమంలోనే టీమ్ఇండియా బౌలింగ్ దళం ఎవరినీ కుదురుకోనీయకుండా పెవిలియన్‌కు చేర్చింది. బుమ్రాకు ఈసారి ఆకాశ్, సిరాజ్ తోడయ్యారు. మెక్ స్వీని, మిచెల్ మార్ష్‌ను ఆకాశ్ ఔట్ చేయగా, హెడ్ (17 పరుగులు), స్మిత్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆఖర్లో పాట్ కమిన్స్ (22) భారీషాట్లకు దిగాడు. కమిన్స్‌ను బుమ్రా బుట్టులో వేసుకున్నాడు. ఇక కమిన్స్ ఔటైన వెంటనే ఆసీస్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
" say those three words!" "head is out!" 😁#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 LIVE NOW! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/X6DhskltyV
— Star Sports (@StarSportsIndia) December 18, 2024
33కే 5 వికెట్లు డౌన్
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. గబ్బా మైదానంలో భారత్‌పై ఆసీస్ ఇంత తక్కువ పరుగులుకే 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 1977లో 49 పరుగులకు ఆసీస్ సగం వికెట్లు కోల్పోయింది.
Innings Break!
— BCCI (@BCCI) December 18, 2024
Australia have declared after posting 89/7 in the 2nd innings.#TeamIndia need 275 runs to win the 3rd Test
Scorecard - https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/bBCu6G0pN5
భారత్‌పై ఆస్ట్రేలియా అతి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భాలు
24/5 | చెన్నై | 1969 |
33/5 | బ్రిస్బేన్ | 2024 |
38/5 | పెర్త్ | 2024 |
48/5 | ముంబయి | 2004 |
49/5 | బ్రిస్బేన్ | 1977 |