3rd Day KCR Bus Yatra in Mahabubnagar : రాష్ట్రంలో జాతీయ పార్టీలు రెండు ఏకమై ప్రాంతీయ పార్టీను దెబ్బతీయాలని చూస్తున్నాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఒక పార్టీ దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుందని, మరో పార్టీ దేవుడిపై ఒట్లు పెట్టుకుని ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆయన చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు మహబూబ్‌నగర్‌కు చేరుకుంది. ముందుగా జడ్చర్ల, అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు.
జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు : కేసీఆర్ - KCR BUS Yatra In Telangana
KCR Comments on Congress : పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని పలుమార్లు బతిమాలిన పట్టించుకోలేదని అన్నారు. అలాంటి బీజేపీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను ఇబ్బందులు పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పిన తాను అంగీకరించలేదని తెలిపారు. రాబోయే కాలంలో కచ్చితంగా మీటర్లు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
"బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయి. దేవుని పేరు చెప్పుకుని ఒకరు, దేవుడిపై ఒట్టు వేసుకుని మరోకరు ఓట్లు అడుగుతున్నారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడింది." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
KCR Election Campaign Mahabubnagar : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వలేదని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కళ్ల ముందే నాశనం అయితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అందరం కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ 10 సీట్లు గెలిస్తే ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడుతామని తెలిపారు.
బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లాభం పొందారా? : కేసీఆర్ - KCR BUS Yatra AT Bhuvanagiri
కాంగ్రెస్ బోగస్ మాటలతో ఆరు హామీలకు పంగనామం పెట్టింది : కేసీఆర్ - KCR BUS Yatra In Telangana