ETV Bharat / offbeat

మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ! - TELANGANA TOURISM ARAKU PACKAGE

ప్రకృతి ప్రేమికుల భూతల స్వర్గం అరకు తనివితీరా విహరించి రావొచ్చు!

Telangana Tourism Araku Package Details
Telangana Tourism Araku Package Details (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 1:14 PM IST

Telangana Tourism Araku Package Details : అందమైన పర్వతాలు.. పాలధారను తలపించే జలపాతాలు.. చిరుజల్లు లాంటి మంచు.. మత్తెక్కించే కాఫీ తోటల పరిమళాలు.. ఇలా ఒక్కటేమిటి అరకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మంచు పొరల చాటున కనిపించే అందాల గురించి చెప్పడం కాదు.. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా ఆస్వాదించాల్సిందే! ఆ కిక్​ వేరే లెవల్​ ఉంటుంది. అందుకే.. చాలా మంది హాలీడేస్​ వస్తే అరకు వెళ్లాలని ప్లాన్​ చేస్తుంటారు. చలికాలంలో ఈ ప్రదేశం మరింత రమణీయంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వింటర్​లో అరకును వీక్షించాలనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం ఓ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ ఈ టూర్‌ ఎలా సాగుతుంది.? ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి? టికెట్​ ధరలు ఎంత వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

తెలంగాణ టూరిజం "అరకు టూర్​" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజులుగా ఉంటుంది. హైదరాబాద్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్​ నిర్వహిస్తారు. హైదరాబాద్​ టూ అరకు ప్రయాణం సాగుతుందిలా..

  • మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు IRO పర్యాటక భవన్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. 6.30 గంటలకు CRO బషీర్‌బాగ్‌ చేరుకుని అక్కడి నుంచి తిరిగి జర్నీ స్టార్ట్​ బయలు దేరుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో భోజనం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు వైజాగ్​ చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్​లో ఫ్రెషప్​ అనంతరం బ్రేక్​ఫాస్ట్‌ ఉంటుంది. బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత కైలాసగిరి, సింహాచలం దేవాలయాలు దర్శించుకున్న తర్వాత రుషికొండ, సబ్‌మెరైన్‌ మ్యూజియం విజిట్​ చేస్తారు. ఆ సాయంత్రం వైజాగ్‌ బీచ్​కు తీసుకెళ్తారు. బీచ్​లో ఎంజాయ్​ చేసిన తర్వాత​ తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రి భోజనం తర్వాత వైజాగ్​ హోటల్​లో స్టే చేయాలి.
  • మూడో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత అరకు టూర్‌ స్టార్ట్​ అవుతుంది. అక్కడకి చేరుకున్న తర్వాత ట్రైబల్‌ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌, బొర్రా గుహలు విజిట్​ చేస్తారు. రాత్రికి ధింసా డ్యాన్స్‌ వీక్షిస్తారు. ఆ రాత్రికి అరకులో స్టే చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం అరకు నుంచి అన్నవరానికి బయలుదేరుతారు. అక్కడ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్​ రిటర్న్​ అవుతారు. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ఇక ధరలు చూస్తే.. హైదరాబాద్​ నుంచి అరకు ట్రిప్​కు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 6,999గా ఉంటుంది. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 5,599గా ధరలు నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం
  • వైజాగ్​లో ఏసీ హోటల్​లో, అరకులో నాన్ ఏసీ హోటల్‌లో వసతి
  • వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కవర్ అవుతాయి.
  • ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఇవి ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 27వ తేదీన అందుబాటులో ఉంది. అది మిస్​ అయితే డిసెంబర్​ 4న కూడా ఉంది.
  • ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

వీకెండ్​ టూర్​: ఒక్కరోజులోనే 4 ప్రదేశాలు - తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ!

ఊటీ సూపర్ టూర్ - బడ్జెట్​ ధరలోనే తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ! - మరికొన్ని ప్రదేశాలు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.