ETV Bharat / health

పాలు తాగాక ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే ఈ ఆరోగ్య సమస్యలు రావడం పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 1:30 PM IST

Unhealthy Combinations With Milk : మీకు పాలు తాగే అలవాటు ఉందా? అయితే పాలు తాగాక ఈ ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాకాకుండా ఒకవేళ తీసుకుంటే కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు రావడం పక్కా అని హెచ్చరిస్తున్నారు! ఇంతకీ, పాలు తాగాక తీసుకోకూడని ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Milk
Unhealthy Combinations With Milk

Avoid These Unhealthy Combinations With Milk : మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలని డైలీ ఒక గ్లాసు పాలు తాగుతుంటారు. నిజానికి పాలలో కాల్షియం, విటమిన్ ఏ, బీ12, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయి పాలు(Milk). అయితే, పాలు ఆరోగ్యకరమైన పానీయమే అయినప్పటికీ.. కొన్ని పదార్థాలతో కలిపి ఎప్పుడూ తీసుకోవద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అలాతీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పాలతో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాలు - చేప : మీకు పాలు తాగే అలవాటు ఉందా? అయితే ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగాక చేపలు తినకండి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. ఎందుకంటే పాలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటే, చేపలు మాత్రం వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే అది రసాయన మార్పులకు దారితీయడమే కాకుండా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పాలు తాగాక వీలైనంతవరకు చేపలు తినకుండా ఉండడం మంచిది.

పాలు - పుచ్చకాయ : మీరు పాలతో కలిపి తీసుకోకూడని మరో ఆహార పదార్థం పుచ్చకాయ. ఈ కాంబినేషన్ కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా పుచ్చకాయలలో 90% నీటి కంటెంట్‌ ఉంటుంది. ఇక వాటర్​మిలన్​లో మూత్రవిసర్జన లక్షణాలు ఉంటే.. అదే పాలలో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. కాబట్టి, పాలు తాగాక పుచ్చకాయ తింటే జీర్ణ సమస్యలు, వికారం వంటి సమస్యలు రావొచ్చంటున్నారు నిపుణులు.

పాలు - అరటి : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పాలు తాగాక అరటిపండు తింటుంటారు. ఈ రెండింటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ.. అరటిపండు, పాలు కలిపి తీసుకోవడం మానుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్ జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా మీకు మైకం, అలసటగా అనిపించవచ్చంటున్నారు నిపుణులు.

మీకు హార్ట్ ఎటాక్ రావొద్దంటే - ఈ 7 ఆహార పదార్థాలను అస్సలు తినొద్దు!

పాలు - ముల్లంగి : ఈ ఫుడ్ కాంబినేషన్ కూడా అనారోగ్యకరమైనది. కాబట్టి మీరు ఎప్పుడూ పాలు తాగాక ముల్లంగి తినకుండా ఉండడం మంచిది అంటున్నారు. ఎందుకంటే ముల్లంగి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో మంటను కలిగిస్తుంది. అలాగే ఈ రెండింటి కాంబినేషన్ జీర్ణక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పాలు - పుల్లని పదార్థాలు : మీరు పాలు తాగాక ఎప్పుడూ పుల్లని లేదా సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పెరుగు, నారింజ, నిమ్మకాయ వంటి పుల్లని వాటిని పాలతో కలిపి తీసుకోకూడదంటున్నారు. ఎందుకంటే వాటిలో విటిమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాలు, పుల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం మొదలైన జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మీకు పాలు తాగే అలవాటు ఉంటే.. తాగాక వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? - మీ ఎముకలు బలహీనంగా మారడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.