Natural Ways To Get Rid of Cockroaches : ఈగలు, దోమలతోపాటు బొద్దింకలు కూడా ప్రతి ఇంటినీ ఇబ్బంది పెడుతుంటాయి. ఆహారం మీద తిరుగుతూ కలుషితం చేస్తుంటాయి. ఇలాంటి ఆహారాన్ని తిన్నారంటే.. అనారోగ్యం ముప్పు ఎదుర్కోవాల్సిందే. అందుకే.. వీటి బెడద వదలించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే స్ప్రేలు ఇంటికి తెచ్చుకుంటారు. కానీ.. వీటి వాడకం వల్ల.. మన శరీరానికి కూడా హానికలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా బొద్దింకలను తరిమి కొట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరచుగా ఉపయోగించని, తేమ ఎక్కువగా ఉండే కప్‌బోర్డులు, వంటింటి సింకుల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బొద్దింకలు తేమ ఉన్న చోట ఎక్కువగా వృద్ధి చెందే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
- తిన్న వెంటనే ప్లేట్లను వాష్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని బయట పారేయడం బెటర్ అంటున్నారు.
- ఇంట్లోని అట్ట పెట్టెలపై కాస్త శ్రద్ధ వహించాలి. చెక్క గుజ్జుతో తయారు చేసే అవి బొద్దింకలకు మంచి ఆహారంగా ఉంటాయని చెబుతున్నారు.
- అవసరం లేని సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే.. వాటి ద్వారా బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది.
- ఇంట్లో యూజ్ చేసే డస్ట్బిన్లు ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే వాటిని నైట్ టైమ్ ఇంటి బయట ఉంచేలా చూసుకోవాలి.
- రాత్రి వేళ ఇంట్లోని డిష్ వాషర్లను కప్పి ఉంచుకోవాలి. చాలా వరకు బొద్దింకలు వాటి నుంచే ఇళ్లలోకి చేరుతుంటాయి.
- ఈ టిప్స్‌తో పాటు కొన్ని నేచురల్ రెమిడీస్ ఫాలో అవ్వడం ద్వారా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఉల్లిపాయలు : వీటి ఘాటైన వాసన బొద్దింకలకు నచ్చదు. కాబట్టి, మీ ఇంట్లో తిరగాడే బొద్దింకలను తరిమికొట్టేందుకు కొద్దిగా ఉల్లిపాయ రసం పిచికారీ చేయండి. దాంతో అవి ఇంట్లో నుంచి పరార్ అవుతాయంటున్నారు నిపుణులు.
ఎన్ని చేసినా ఇంటి నుంచి బల్లులు పోవడం లేదా - ఈ టిప్స్ పాటిస్తే వాటిని తరిమికొట్టడం వెరీ ఈజీ!
లవంగం : బొద్దింకల నివారణకు లవంగం బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు శ్రమా అవసరం లేదు. బొద్దింకలు సంచరించే ప్రదేశంలో లవంగాలను పెడితే సరిపోతుందంటున్నారు నిపుణులు
2009లో "Journal of Entomology and Zoology"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగాల నూనె బొద్దింకలను దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎం.హెచ్. మోషాంగ్ పాల్గొన్నారు. లవంగం నూనె బొద్దింకలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
బేకింగ్ సోడా షుగర్ : ఈ రెండు పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లుకోండి. ఇవి తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి. అప్పుడు వాటిని తీసి బయటపడేసుకుంటే సరిపోతుంది.
దాల్చినచెక్క : దీని ఘాటైన వాసన బొద్దింకలకు.. అలెర్జిక్ రియాక్షన్ ఇస్తుంది. కాబట్టి, దాల్చిన చెక్క పొడిని.. ఉప్పులో కలిపి.. బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లండి. ఇది బొద్దింకలు, వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.