ETV Bharat / entertainment

వరుణ్ తేజ్ - లావణ్య ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 4:48 PM IST

Updated : Feb 24, 2024, 6:34 PM IST

Varun Tej Lavanya special pooja : లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ దంపతులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. వీరిద్దరు అందుకోసమే ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. దాని గురించే ఈ కథనం.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?

Varun Tej Lavanya special pooja : మెగా కోడలు లావణ్య త్రిపాటి - వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత తమ పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టారు. లావణ్య ఇటీవలే మిస్​ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది పర్వాలేదనిపించింది. వరుణ్ తేజ్​ కూడా ఎయిర్ ఫోర్స్ బ్యాక్​డ్రాప్​లో ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో నటించారు. ఈ మూవీ మార్చి 1వ తేదీన బాక్సాఫీస్ ముందు రిలీజ్ అవ్వనుంది. సినిమాకు శక్తి ప్రతాప్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించింది.

అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్​లో జోరు పెంచారు మెగా హీరో వరుణ్ తేజ్. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి గోదావరి తల్లిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పూజారులతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు తెలిపారు. లావణ్య కూడా గోదావరిలోని పడవ ఫోటోను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట్లో వైరల్​గా మారి తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలే ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్​​ తన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్​తోనైనా హిట్ అందుకోవడానికి ఈ ప్రత్యేక పూజలు చేశారా అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది మరేదైనా కారణం ఉందా అని తెగ ఆలోచిస్తున్నారు.

కాగా, తొలిసారి 2017లో మిస్టర్‌ మూవీ కోసం వరుణ్‌ తేజ్​ - లావణ్య త్రిపాఠి తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహబంధం ఏర్పడింది. అనంతరం అంతరిక్షం చిత్రంలోనూ ఈ జంట కలిసి నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అలా దాదాపు ఐదారేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటలీ వేదికగా వీరి వివాహం గ్రాండ్​గా జరిగింది.

అకీరా న్యూ లుక్​ సూపర్ - ట్రెండ్ మొదలెట్టేశాడు!

నెట్​ఫ్లిక్స్​లో టాప్ - 10 ట్రెండింగ్​ మూవీస్​ - లిస్ట్​లో ముగ్గురు తెలుగు స్టార్స్​!

Last Updated : Feb 24, 2024, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.