Ram Charan Upasana Interview : ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉన్నట్లు, ప్రతి మహిళ గెలుపు వెనక ఓ పురుషుడు ఉండాలటున్నారు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు చెర్రీ ఉపాసన దంపతులు. ఈ మేరకు ఈ జంట పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.
"చరణ్ వాళ్లది మాది చాలా డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. పెళ్లైన వెంటనే నాకు వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం నేను అతడికి నీడలా ఉంటుంన్నందుకు నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. బిడ్డను కనాలని డెసిషన్ తీసుకున్నప్పుడే క్లీంకారకు జన్మనిచ్చాం. మా అమ్మ వాళ్లను మా తాతయ్య ఎంతో కాన్ఫిడెంట్‌గా పెంచారు. వాళ్లు కూడా ఆయన కలలకు అనుగుణంగానే జీవించారు. మా ఫ్యామిలీలోని మహిళలు నా జీవితంలోనూ ఎంతో కీలకపాత్ర పోషించారు. నేను స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో పుట్టాను" అంటూ ఉపాసర తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో చెర్రీ కూడా ఉపాసనపై గురించి పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. తన సతీమణిని ప్రశంసలతో ముంచెత్తారు.
"కేవలం నా భార్య కావడం వల్లే ఉపాసనకు ఏం గుర్తింపు రాలేదు. ఆమె చేసే ఎన్నో మంచి పనులే తనను ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో ఉప్సీ తనదైన ముద్ర వేసింది. కుటుంబ విలువలను ఆమె ఎంతగానో గౌరవిస్తుంది. వారసత్వాన్నికూడా ఎంతో అందంగా ముందుకు తీసుకువెళ్తుంది" అంటూ ఉపాసన గురించి చరణ్ మాట్లాడారు.
భార్య కాళ్లు నొక్కిన చెర్రీ
ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖలందరికీ ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకల కోసం జామ్‌నగర్‌కు పయనమయ్యారు. అయితే ఫ్లైట్‌లో ఉప్సీ అలసటగా నిద్రిస్తున్న సమయంలో చెర్రీ ఆమె కాళ్లు పట్టుకుని నెమ్మదిగా నొక్కుతూ కనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా, ఫ్యాన్స్ ఈ క్యూట్ కపుల్ గురించి స్వీట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన హింట్ - ఆనందంలో మెగా ఫ్యాన్స్!
అత్తమ్మ బర్త్ డే స్పెషల్ - మరో గుడ్ న్యూస్‌తో ఉపాసన సర్ప్రైజ్