ETV Bharat / entertainment

కీర్తి సురేశ్ వెడ్స్​ ఆంటోనీ - గోవాలో గ్రాండ్​గా పెళ్లి - ఫొటోలు చూశారా? - KEERTHY SURESH WEDDING PHOTOS

గోవాలో గ్రాండ్​గా కీర్తి సురేశ్ వెడ్డింగ్ - ఫొటోలు చూశారా?

Keerthy Suresh And Antony Thattil Wedding
Keerthy Suresh And Antony Thattil Wedding (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 2:59 PM IST

Keerthy Suresh And Antony Thattil Wedding Photos : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీని వివాహమాడారు. గోవాలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి తాజాగా నెట్టింట షేర్ చేసుకున్నారు. ఇక వాటిని చూసిన అభిమానులు ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్​ చెప్తున్నారు.

తాజాగా తన రిలేషన్​షిప్​ గురించి ఓపెనప్​ అయ్యారు కీర్తి. ఆంటోతో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమె దిగిన ఓ స్పెషల్ ఫొటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు. దీనికి అభిమానులు, సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. నెట్టింట ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్ చెప్పారు.

గతంలోనూ ఆమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారని, ప్రస్తుతం ఆయనకు కేరళలో బిజినెస్​ చేస్తున్నారని టాక్‌ నడిచింది.

ఇక కాలేజీ రోజుల నుంచే కీర్తి - ఆంటోనీ స్నేహితులు. సుమారు 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం. అయితే గతంలోనే ఈ ఇద్దరి పేర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవ్వగా, దానిపై కీర్తి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్​ కానీ స్పందించలేదు. తాజాగా కీర్తి తండ్రి తమ కుమార్తె పెళ్లి గురించి త్వరలోనే చెప్తామని వెల్లడించడం వల్ల అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

​'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన కీర్తి 'నేను శైలజ', 'మహానటి' లాంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. అయితే రీసెంట్​గా ఆమె నటించిన 'రఘు తాత' మిక్స్​డ్​ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్‌ రీటా', 'బేబీ జాన్‌' అనే రెండు సినిమాల కోసం వర్క్​ చేస్తున్నారు.

ప్రియుడి గురించి ఫస్ట్​ టైమ్ రివీల్ చేసిన కీర్తి సురేశ్ - అతడేనా?

'అప్పుడు మా అమ్మకు 16 ఏళ్లు.. షూటింగ్ సమయంలో చిరు అలా చూసుకునేవారట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.